బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11కి చేరిన మృతుల సంఖ్య

18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ఆనందం విషాదంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం రాత్రి జరిగిన భారీ తొక్కిసలాటలో ఎనిమిది మంది అభిమానులు మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఒక బాలుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనతో స్టేడియం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

ఐపీఎల్ కప్ గెలిచిన తరుణంలో, అభిమానుల సంబరాల కోసం చిన్నస్వామి స్టేడియంలో ప్రత్యేక సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. అయితే, అభిమానులు ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో స్టేడియం వద్దకు చేరుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. అభిమానులు ఒక్కసారిగా లోపలికి దూసుకురావడంతో పోలీసులు సైతం పరిస్థితిని అదుపు చేయలేకపోయారని అధికారులు తెలిపారు. తక్కువ సమయంలో ప్రభుత్వం నుంచి అనుమతి రావడం, సరైన ఏర్పాట్లు చేయలేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

massive stampede at Chinnaswamy Stadium in Bengaluru

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "జనాల్ని చంపేందుకే కప్ సాధించారా?" అంటూ ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏ జట్లూ ఆర్సీబీ మాదిరిగా సెలబ్రేషన్స్ చేయలేదని, వారి అతి కారణంగానే అభిమానులు మరణించారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై క్రికెట్, రాజకీయ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

Jun 04, 2025, 7:01 pm IST

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11కి చేరిన మృతుల సంఖ్య
Jun 04, 2025, 5:51 pm IST

50 మందికి పైగా గాయాలు
Jun 04, 2025, 5:50 pm IST

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+