జూలు విదిల్చిన బ్రెజిల్: నెయ్‌మార్ లేని లోటు తీరినట్టే.. !!

ప్రపంచకప్‌లో అయిదుసార్లు విజేతగా నిలిచిన బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు గ్రూప్ దశలో అద్భుత పునరాగమనాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్ లో మొరాకోతో డ్రా వల్ల డీలా పడ్డ అభిమానులకు నూతన జోష్ ను అందించింది. రెండో మ్యాచ్ లో జూలు విదిల్చింది. హైతీని చిత్తు చేసింది. ఫిలడెల్ఫియా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ను బ్రెజిల్ ఏకపక్షంగా మార్చివేసింది. 3-0 తేడాతో హైతీని మట్టికరిపించింది. ఈ విజయంతో బ్రెజిల్ తన నాకౌట్ అవకాశాలను మెరుగుపరుచుకోగా హైతీ కథ ముగిసింది.

ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ స్టార్ ఆటగాడు మాథ్యూస్ కున్హా అద్భుతమైన ప్రదర్శనతో రెండు గోల్స్ సాధించగా, మరో స్టార్ వినీషియస్ జూనియర్ ఒక గోల్‌తో మెరిశాడు. మొదటి గ్రూప్ మ్యాచ్‌లో మొరాకో జట్టుతో 1-1 డ్రాతో నిరాశపరిచిన బ్రెజిల్‌కు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవడం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కోచ్ కార్లో అన్సెలోటీ జట్టులో చేసిన కీలక మార్పులు చక్కటి ఫలితాన్ని ఇచ్చాయి. జట్టును విజయ తీరాలకు చేర్చాయి.

Matheus Cunha Shines and Vin cius Junior Delivers as Brazil Earns Decisive 3-0 World Cup Win Over Haiti

గత మ్యాచ్‌లో చివరి నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి దిగిన మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ మాథ్యూస్ కున్హాను ఈసారి ఆరంభం నుంచే జట్టులోకి పంపాడు. కోచ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కున్హా మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రత్యర్థి డిఫెన్స్ ను ఛేదిస్తూ చెలరేగిపోయాడు. మ్యాచ్ 32వ నిమిషంలో వినీషియస్ కొట్టిన షాట్‌ను హైతీ గోల్‌కీపర్ జోనీ ప్లాసైడ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. చేతుల్లోంచి రిబౌండ్‌గా వచ్చిన ఆ బంతిని కున్హా అత్యంత వేగంగా గోల్‌గా మలిచాడు.

దీంతో బ్రెజిల్‌కు 1-0 ఆధిక్యం అందించింది. అనంతరం కున్హా తన విలక్షణమైన సర్ఫింగ్ శైలిలో సంబరాలు చేసుకుని ప్రేక్షకులను మైమరపించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే వినీషియస్ అందించిన మరో చక్కని పాస్‌తో.. బంతిని హైతీ గోల్‌పోస్ట్ టాప్ ఎడ్జ్ లో కొట్టిన షాట్ హైలైట్. దీంతో బ్రెజిల్ గోల్స్ రెండుకు చేరాయి. ప్రథమార్ధం ముగిసే సమయానికి వినీషియస్ జూనియర్ స్వయంగా మరో అద్భుత గోల్ సాధించడంతో బ్రెజిల్ మూడు గోల్స్ ఆధిక్యంతో పూర్తి నియంత్రణ సాధించింది.

1974 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన హైతీ ఈ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫిఫా వరల్డ్ కప్ నుంచి వైదొలగిన మొదటి జట్టుగా రికార్డుల్లో నిలిచింది. హైతీ మద్దతుదారులు తమ సాంప్రదాయ శైలిలో పాటలు పాడుతూ తమ జట్టును ఉత్సాహపరిచినప్పటికీ, బ్రెజిల్ అనుభవం ముందు తలవంచక తప్పలేదు. బ్రెజిల్ అభిమానులు తమ ఫుట్‌బాల్ దిగ్గజం పీలేను స్మరిస్తూ ఆయన ఘనతను నినాదాల రూపంలో స్టేడియంలో హోరెత్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+