క్రికెట్ లో న్యూ హార్ట్ థ్రోబ్: క్యూట్ అండ్ కాన్ఫిడెంట్ యాటిట్యూడ్‌ కు ఫిదా

విమెన్స్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఓ న్యూ సెన్సేషన్ క్రికెటర్ ను అందించింది. సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్ జట్టు తరఫున ఈ లీగ్ లో ఆడుతోన్న ఆల్‌రౌండర్ మేధావి బిదూరి ఇప్పుడు హార్ట్ థ్రోబ్ అయి కూర్చుంది. మొన్నటివరకు స్మృతి మంధానను నేషనల్ క్రష్ గా గుర్తిస్తూ ఈ జెన్ జీ జనరేషన్ ఇప్పుడిక మేధావి బిదూరికి జైకొడుతోంది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈమె హవా నడుస్తోంది. ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టా ఓపెన్ చేస్తే.. ఈ యంగ్ క్రికెటర్ ఫొటోలు, వీడియోలే దర్శనం ఇస్తోన్నాయి.

దీనికి కారణం లేకపోలేదు. మేధావి బిదూరి సెట్ చేసిన ఓ నయా ట్రెండ్. వికెట్ తీసిన తర్వాత ఆమె సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. జెన్ జీ స్టైల్ సెలబ్రేషన్ నెటిజన్లను కట్టిపడేస్తోంది. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్ తరఫున ఆడిన మేధావి బిధూరి బౌలింగ్ లో అదరగొట్టింది. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు కూల్చింది.

Medhavi Bidhuri Viral 6 7 Wicket Celebration New Signature trend takes Delhi Premier League by Storm

మైదానంలో మేధావి బిధూరి చూపిన ఈ క్యూట్ అండ్ కాన్ఫిడెంట్ యాటిట్యూడ్‌ పట్ల నెటిజన్లు ఫిదా అయ్యారు. జెన్ జీ జనరేషన్ ఓ రోల్ మోడల్ గా నిలిచారని, సాధారణంగా క్రికెట్ లో జోష్ కు తన నయా సిగ్నేచర్ తో నూతన ఒరవడికి తెర తీసిందనే కామెంట్లు పెడుతున్నారు. వికెట్లు పడగొట్టడం ఒక ఎత్తయితే, ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న 6-7 సిగ్నేచర్ ను గ్రౌండ్ లో ఇంట్రడ్యూస్ చేయడం ఈ తరాన్ని కట్టిపడేసినట్టయింది.

పసిడి రేట్లకు పూనకాలు- తగ్గేదే లేదు
పసిడి రేట్లకు పూనకాలు- తగ్గేదే లేదు

ఈ సిగ్నేచర్.. మేధావి బిదూరి చెల్లి ఆలోచనే. ఇంటర్నెట్‌లో వైరల్ ట్రెండ్స్‌, ప్రత్యేకించి ఈ తరం యువత బాగా ఇష్టపడే జెన్ జీ స్టైల్‌ను గ్రౌండ్ లో ప్రదర్శించాలని ఆమె సూచించింది. దీనికోసమే జెర్సీ నంబర్ 67ను ధరించాలని కూడా అడ్వైజ్ చేసింది. దీన్ని చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపించింది బిదూరి. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌ తో జరిగిన మ్యాచ్ లో 16వ ఓవర్ లో నిషికా సింగ్ వికెట్ పడగొట్టిన తర్వాత ఆమె చేసిన ఈ సెలబ్రేషన్ ప్రకంపనలు ఇంకా తగ్గట్లేదు.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ లో హాట్ టాపిక్ ఈ 6-7 సైన్. ఇన్‌సైడ్ జోక్‌గా ట్రెండింగ్ లో ఉంటోంది. దీనికి ఎలాంటి ప్రత్యేక అర్థం గానీ, వివరణలు గానీ లేవు. జెన్ జీ దీన్ని ఓ ట్రెండ్‌గా ప్రయోగించింది. ఇది ఫుల్ కనెక్ట్ అయింది ఈ తరానికి. ఇప్పుడిప్పుడే క్రికెట్ లో అడుగు పెట్టిన మేధావి బిదూరి విమెన్స్ ఐపీఎల్ లో ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖాయమైందనే అభిప్రాయాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+