మట్టికరిచిన దిగ్గజం.. బెల్జియం: ఫిఫా నుంచి అవుట్: మునిగిందక్కడే

ఫిఫా ప్రపంచకప్‌ లో బెల్జియం అనూహ్యంగా ఓటమిపాలైంది. క్వార్టర్ ఫైనల్స్ దశలోనే ఇంటిదారి పట్టింది. స్పెయిన్ చేతిలో మట్టికరిచింది. తన అద్భుత ఓటమి ఎరుగని ప్రయాణాన్ని కొనసాగిస్తూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.. స్పెయిన్. సోఫై స్టేడియంలో బెల్జియంతో జరిగిన రసవత్తరమైన క్వార్టర్‌ ఫైనల్‌ లో 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగియడానికి రెండు నిమిషాల ముందు సబ్‌స్టిట్యూట్ మిడ్‌ఫీల్డర్ మైకెల్ మెరినో సాధించిన మెరుపు గోల్‌తో స్పెయిన్ విజయం ఖాయమైంది.

వచ్చే మంగళవారం డల్లాస్‌లో సెమీఫైనల్‌ లో టోర్నమెంట్ ఫేవరెట్ ఫ్రాన్స్ తో తలపడుతుంది ఈ యూరోపియన్ ఫుట్ బాల్ టీమ్. గేమ్ మొదటి నిమిషం నుండి ముగింపు వరకు ఇరు జట్ల ఆటగాళ్ళు పోటాపోటీగా తలపడటంతో అసలైన ఫుట్‌బాల్ మజా లభించింది. పెద్రీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రూయిజ్, రొడ్రీతో కలిసి మిడ్‌ఫీల్డ్‌ను అద్భుతంగా డ్రైవ్ చేశాడు. 19 ఏళ్ల యువ సంచలనం లామిన్ యామల్ కూడా మ్యాచ్ ప్రథమార్థంలోనే గోల్ కోసం చేసిన ప్రయత్నం తృటిలో తప్పింది.

Mikel Merino scored another late winner as Spain edged Belgium 2-1 on to set up a FIFA semifinal

బెల్జియం డిఫెన్స్ పై నిరంతరం ఒత్తిడి తెచ్చిన స్పెయిన్‌కు మ్యాచ్ 30వ నిమిషంలో ఫలితం దక్కింది. స్టార్ ప్లేయర్ డాని ఓల్మో కొట్టిన కిక్ ను బెల్జియం కీపర్ టిబాత్ కోర్టోయిస్ అడ్డుకున్నప్పటికీ.. రీబౌండ్‌ అయిన బంతిని ఫాబియన్ రూయిజ్ వెనువెంటనే చాకచక్యంగా గోల్‌గా మలిచాడు. దీంతో స్పెయిన్ కు 1-0 ఆధిక్యాన్ని లభించింది. ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. సరిగ్గా 41వ నిమిషంలో బెల్జియం ఆటగాడు చార్లెస్ డి కెటెలారే అద్భుతమైన హెడర్ ద్వారా బంతిని నెట్‌లోకి పంపి 1-1తో స్కోరును సమం చేశాడు.

ఈ టోర్నీలో స్పెయిన్‌పై నమోదైన తొలి గోల్ కూడా ఇదే. 70వ నిమిషంలో గోల్‌కీపర్ కోర్టోయిస్ గాయపడి గ్రౌండ్ ను వీడాడు. దీంతో ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అరంగేట్రం చేయని యువ గోల్‌కీపర్ సెన్నే లామెన్స్ అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితుల మధ్య బరిలో దిగాల్సి వచ్చింది. లామెన్స్ చేసిన ఓ చిన్న పొరపాటే చివరకు బెల్జియం పరాజయానికి దారితీసింది. ఆర్సెనల్ మిడ్‌ఫీల్డర్ మైకెల్ మెరినో మ్యాచ్ 86వ నిమిషంలో గోల్ సాధించాడు. అదే స్పెయిన్ ను గెలిపించింది.

పావ్ కుబార్సి కొట్టిన లాంగ్ షాట్‌ను లామెన్స్ కంట్రోల్ చేయలేకపోయాడు. అదే బంతిని మెరెనో గోల్‌పోస్ట్‌లోకి నెట్టాడు. దీంతో స్పెయిన్ జట్టు ఆనందానికి అవధుల్లేకపోయింది. ఆఖరి నిమిషాల్లో స్కోర్ సమం చేయడానికి బెల్జియం తీవ్రంగా ప్రయత్నించింది. జెరెమీ డోకు వంటి ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ స్పెయిన్ డిఫెన్స్ ను చేధించలేకపోయారు. అలెక్సిస్ సేల్‌మేకర్స్ అందించిన చక్కటి క్రాస్‌ను రొమేలు లుకాకు సరిగ్గా అందుకోలేకపోవడంతో బెల్జియం ఆశలు అడియాశలయ్యాయి.

రెఫరీ క్లోజింగ్ విజిల్ వేయగానే స్పెయిన్ ఆటగాళ్లు విజయోత్సవాల్లో మునిగిపోయారు. ఆనందంలో తేలియాడారు. మ్యాచ్ ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన గోల్ కీపర్ లామెన్స్‌ను తిబాత్ కోర్టోయిస్ గ్రౌండ్ లోకి వచ్చి ఓదార్చడం కనిపించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే వార్మప్ సెషన్‌లో కెప్టెన్ యూరి టైల్‌మన్స్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం తీవ్ర నష్టం చేకూర్చింది. దీంతో అతని స్థానంలో హన్స్ వానాకెన్‌ను మైదానంలోకి దించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ అనంతరం వినీషియస్ జూనియర్ మాట్లాడాడు. తన దేశానికి, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+