డీలా పడ్డ ఢిల్లీ కేపిటల్స్ చేతికి బ్రహ్మాస్త్రం.. ఓటముల వేళ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో వరుస ఓటములకు గురవుతోంది టైటిల్ హాట్ ఫేవరెట్.. ఢిల్లీ కేపిటల్స్. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ లల్లో మూడింట్లో నెగ్గింది. ప్రస్తుతం ఆరు పాయింట్లతో టేబుల్ లో అయిదో స్థానంలో నిలిచింది. ఈ నెల 26వ తేదీన బలమైన పంజాబ్ కింగ్స్ తో తలపడబోతోంది. ఢిల్లీ దీనికి వేదిక. డబుల్ హెడ్డర్స్ లో భాగంగా శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ జరుగనుంది.
ఈ పరిస్థితుల్లో గుడ్ న్యూస్ అందిందా జట్టుకు. ఇన్నాళ్లూ మ్యాచ్ లకు దూరమైన ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిఛెల్ స్టార్క్ జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. భుజం, మోచేతి గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అతనికి క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. శుక్రవారం నాటికి అతను భారత్ కు చేరుకుంటాడు. జట్టుతో కలుస్తాడని తెలుస్తోంది. శనివారం జరిగే మ్యాచ్ లో ఆడేది అనుమానమే. మే 1న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు ఆడటం దాదాపుగా ఖయమైనట్టే. అతని పునరాగమనం జట్టులో ఆశలు రేకెత్తిస్తోంది.

36 ఏళ్ల మిఛెల్ స్టార్క్ గాయం కారణంగా జనవరి చివరి వారం నుండి దూరంగా ఉంటోన్నాడు. బిగ్ బాష్ లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో కింద పడ్డాడు. అతని భుజం పక్కకు జారింది. మోచేతికీ గాయాలయ్యాయి. దీంతో మ్యాచ్ లకు దూరం అయ్యాడు. అంతకుముందు యాషెస్ సిరీస్ లో స్టార్క్ అద్భుతంగా రాణించాడు. అయిదు టెస్టుల్లో 150కి పైగా ఓవర్లు బౌలింగ్ చేసి, 20 కంటే తక్కువ సగటుతో 31 వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లో టాప్ ప్లేయర్‌గా నిలిచాడు.
సిడ్నీ సిక్సర్స్ తరఫున అయిదు బిగ్ బాష్ మ్యాచ్‌లు ఆడాడు స్టార్క్. ఫిబ్రవరిలో అతని గాయం తిరగబెట్టింది. దీంతో ఐపీఎల్ అరంగేట్రం ఆలస్యమైంది. ప్రారంభ మ్యాచ్ లకు దూరం అయ్యాడు. స్టార్క్ ఈ వారం భారత్‌కు రావచ్చని తెలుస్తోంది. ఢిల్లీ కేపిటల్స్ తదుపరి రెండు మ్యాచ్‌లు.. ఏప్రిల్ 25న పంజాబ్ కింగ్స్, 27న ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లకు అందుబాటులో ఉండకపోవచ్చు. మే 1న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడతాడని భావిస్తోన్నారు. ముఖేష్ కుమార్, లుంగి ఎన్గిడి, టీ నటరాజన్ తో కూడిన ఢిల్లీ పేస్ అటాకింగ్.. స్టార్క్ రాకతో మరింత పదునెక్కుతుంది.












Click it and Unblock the Notifications