ప్రతిష్ఠాత్మక అవార్డుకు మహ్మద్ షమీ
Mohammed Shami: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో అద్భుతంగా ఆడిన ప్లేయర్.. మహ్మద్ షమీ (Mohammed Shami). ఈ టోర్నమెంట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయ పడటం వల్ల జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఈ వరల్డ్ కప్‌లోనే అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు.
టోర్నమెంట్ మొత్తం మీద ఏడు మ్యాచ్‌లను మాత్రమే ఆడిన షమీ.. 24 వికెట్లు నేలకూల్చాడు. సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై ఏడు వికెట్లను పడగొట్టి తన సత్తా చాటాడు. అంతకుముందు కూడా నాలుగుకు తక్కువ కాకుండా వికెట్లను పడగొట్టాడు. వరల్డ్ కప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లను పడగొట్టిన ప్లేయర్‌ల సరసన నిలిచాడు.

అంతకుముందు- గ్లెన్ మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్, మిఛెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, వసీం అక్రమ్, లసిత్ మలింగ.. ఈ ఘనతను అందుకున్నారు. సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై ఏడు వికెట్లను నేలకూల్చడం అతని ప్రతిభకు అద్దం పట్టింది. అదే ఫామ్‌ను లీగ్స్‌లోనూ కనపర్చాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం రెడీ అవుతున్నాడు షమీ. ఈ నెల 26వ తేదీన సెంచూరియన్‌లో ప్రారంభం అయ్యే బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం త్వరలోనే అతను దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లనున్నాడు.
ఇప్పుడు ప్రతిష్ఠాత్మక పురస్కారానికి నామినేట్ అయ్యాడు. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభను కనపర్చిన వారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు అతని పేరును సిఫారసు చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. ఈ సంవత్సరంలో అర్జున అవార్డు కోసం అతని పేరును రెకమెండ్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది.












Click it and Unblock the Notifications