మహీర శర్మతో మహ్మద్ సిరాజ్ డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన మియా భాయ్!
Mohammed Siraj: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బాలీవుడ్ నటి మహీరా శర్మలు కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్లు వచ్చిన కథనాలకు ఫుల్ స్టాప్ పడింది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ కూడా కోడై కూసింది. కానీ ఈ విషయంపై ఇద్దరు కుండబద్దలు కొట్టినట్లు అసలు విషయాన్ని చెప్పేశారు. మహీరా శర్మ తాను ఎలాంటి రిలేషన్ లో లేనని ఇన్ స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టగా.. దయచేసి ఫోటోగ్రాఫర్స్ అలాంటి ప్రశ్నలు అడగవద్దని.. తన మీద జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని.. అందులో నిజాలు లేవంటూ సిరాజ్ ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. ఒకే రోజు ఇద్దరూ స్టోరీలు పెట్టడంతో వారిద్దరి మధ్య రిలేషన్ ఉందని ప్రచారం అవుతున్న రూమర్స్ పై క్లారిటీ వచ్చింది. ఈ రూమర్స్ ను ముగించాలని తాను ఆశిస్తున్నట్లు సిరాజ్ తెలిపాడు.
బాలీవుడ్ నటి మహీర శర్మ, సిరాజ్ మధ్య రిలేషన్ గురించి ఊహాగానాలు నెలల తరబడి వ్యాపించిన సంగతి తెలిసిందే. వారిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వచ్చాయి. సిరాజ్ మహీర ఇన్ స్టా పోస్టులలో ఒకదానిని లైక్ చేయడాన్ని ఫ్యాన్స్ గమనించారు. ఆ తర్వాత ఇద్దరూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ఒకరినొకరు ఫాలో కావడం ప్రారంభించినప్పుడు డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలకు దారి తీసింది.

ఈ ఊహాగానాల నేపథ్యంలో మార్చి 20న ముంబైలో బాలీవుడ్ బ్యూటీ మహీర శర్మ ఓ ఈవెంట్‌కి హాజరైంది. అక్కడికి వచ్చిన పాపరాజీస్(సెలబ్రిటీల ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్స్) ఈ సారి ఐపీఎల్ లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారంటూ అడిగారు. రేపటి నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుందని.. ఎవరి సైడ్ ఉంటారని ప్రశ్నించారు. ఆమె ఎప్పుడూ ఎటువంటి సమాధానం ఇవ్వకపోయినా, మహిరా నిరంతరం సిగ్గుపడుతూ కనిపించింది, ఇది డేటింగ్ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. ఈ రూమర్స్ నేపథ్యంలోనే ఆ ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.
"Stop spreading rumors, I am not dating anyone".
— Satish Mishra 🇮🇳 (@SATISHMISH78) March 22, 2025
- Mahira Sharma wrote on the Instragram story. pic.twitter.com/0ZcWFwFhGr












Click it and Unblock the Notifications