IND Vs AUS:ఫైనల్ వేళ సిరాజ్ ఎమోషనల్ - ఛాన్స్ లేదా, ఫ్యాన్స్ సపోర్ట్..!!
ప్రపంచ కప్ ఫీవర్ తో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. భారత్ ను వరల్డ్ కప్ ఫైనల్ మేనియా కమ్మేసింది. సొంత గడ్డ పైన 12 ఏళ్ల తరువాత టీం ఇండియా ఫైనల్స్ లో ఆడుతోంది. అందునా ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ లో జరుగుతున్న ఈ ఫైనల్ లో టీం ఇండియా టైటిల్ ఫేవరెట్ గా ఉంది. ఫైనల్స్ లో టీం ఇండియా తుది జట్టు కూర్పు ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో మహ్మద్ సిరాజ్ చేసిన ఎమోషనల్ పోస్టింగ్ వైరల్ అవుతోంది.
తుది సమరం: ప్రపంచ కప్ లో టీమిండియా పేస్ త్రయం ప్రత్యర్ధి టీంకు చుక్కలు చూపిస్తోంది. ఫైనల్స్ లోనూ ఈ ముగ్గురు బౌలింగ్ పైనే భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుందనే అభిప్రాయం ఉంది. దీంతో, ముగ్గురు పేసర్లలో సిరాజ్ ను డ్రాప్ చేసి అశ్విన్ కు ఛాన్స్ ఇస్తారనే విశ్లేషణలు ఉన్నాయి.

స్పిన్నర్లను ఎదుర్కోవటంలో ఆసీస్ బ్యాటర్లకు ఇబ్బందులు ఉన్నాయి..లైట్ల కింద బంతి మరింతగా తిరిగే అవకాశం ఉండటంతో ఈ మార్పు ఉంటుందని చెబుతున్నారు. అయితే, ప్రస్తుత టీంను యధావిధిగా కొనసాగిస్తే మంచిదనే సూచనలు అందుతున్నాయి. ఫైనల్స్ లో ప్రయోగాల కంటే ఉన్న టీంనే సమర్ధంగా వినియోగంచుకోవాలని సీనియర్లు సూచిస్తున్నారు. ఇదే సమయంలో మహ్మద్ సిరాజ్ చేసిన ఓ పోస్లింగ్ వైరల్ అవుతోంది.
సిరాజ్ పోస్టు వైరల్: ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న వేళ సిరాజ్ చేసిన ఈ పోస్టు కు ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. సిరాజ్ తన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ మియా ఓ పోస్ట్ ను తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేసాడు..ఆ పోస్ట్ లో తన తండ్రి నుండి వచ్చే కాల్ ని చూడాలి అనుకుంటున్నాను. ఐ మిస్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసాడు. ఇది చూసిన సిరాజ్ ఫ్యాన్స్ ధైర్యం గా ఉండాలి అని కోరుతున్నారు. సిరాజ్ తన దేశాన్ని గర్వించేలా చెయ్యాలి అని పలుమార్లు తనకు చెప్పినట్లు గుర్తు చేసుకునే వారు.
ఆటో డ్రైవర్ కొడుకు గా, గల్లీ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న మియా ఇప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు. తన తండ్రి ప్రస్తావన వచ్చి ప్రతిసారి సిరాజ్ ఆ బాధను దిగమింగుకుంటాడు. కానీ తన తండ్రి నుండి కాల్ రావాలి అని అనుకుంటున్నాను అని పోస్ట్ చేయడం తో ఆ పోస్ట్ వైరల్ గా మారింది.
Mohammed Siraj's Instagram story. pic.twitter.com/v9JesgB6NY
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2023
అశ్విన్ కు ఛాన్స్..!: ప్రపంచ కప్ లో సిరాజ్ బౌలింగ్ చెప్పుకొనే స్థాయిలో ఉన్నా..ఎక్కువ రన్స్ ఇస్తుండటంతో పాటుగా అహ్మదాబాద్ పిచ్ కండీషన్ల కారణంగా అశ్విన్ కు స్థానం ఇస్తారని భావిస్తున్నారు. సిరాజ్ బౌలింగ్ లో బూమ్రా తో కలిసి బంతి పంచుకుంటున్నాడు. ఫైనల్స్ ..ఒత్తిడిని ఎదుర్కోవటంలో ఆసీస్ టీంకు అనుభవం ఉంది. దీంతో పాటుగా సీమర్లను ఆసీస్ బ్యాటర్లు సులువుగా ఆడుతారు.

స్పిన్నర్లను ఆడటంలో ఆసీస్ బ్యాటర్లకు బలహీనతలు ఉన్నాయి. దీంతో..పిచ్ స్వభావం మరోసారి పరిశీలించిన తరువాత సిరాజ్ స్థానంలో అశ్విన్ ను తీసుకుంటారా..లేక ఇదే టీంను కొనసాగిస్తారా అనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు జరిగే ఫైనల్స్ పైన టీమిండియా పైన భారీ అంచనాలు ఉన్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications