ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా
ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. నేడు తొలి సెమీ ఫైనల్. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. నాకౌట్ మ్యాచ్ లు ఇవి. ఓడిన జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. రేపు ఇంగ్లాండ్ ను ఢీ కొట్టబోతోంది భారత్. ఈ రెండింట్లో గెలిచిన జట్లు ఫైనల్స్ కు చేరుకుంటాయి. టైటిల్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. అలాగే ఫైనల్స్ లో నాటి పరాభవాన్ని అధిగమించాలని భావిస్తోంది దక్షిణాఫ్రికా. ఈ రెండు జట్ల భవితవ్యం ఏమిటనేది నేడు, రేపు తేలిపోతుంది.
టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి మొదలవుతుంది. తొలి మ్యాచ్ ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. ఫైనల్ మే 31న జరుగుతుంది. ఈ ఐపీఎల్ లో అందరి చూపు కూడా చెన్నై సూపర్ కింగ్స్ మీదే నిలిచిందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే- గత సీజన్ లో ఏ మాత్రం కూడా తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయింది. మహేంద్ర సింగ్ ధోనీ వంటి అనుభవజ్ఞుడు ఉన్నా ఓటమి తప్పలేదు. ప్రస్తుతం ధోనీ నెట్ ప్రాక్టీస్ లో తీరిక లేకుండా గడుపుతున్నాడు.

ఈ పరిణామాల మధ్య అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాంచీలో అతివేగంతో వాహనం నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు ఎంఎస్ ధోనీపై చలాన్ విధించారు. ఆయన నివాసం సమీపంలో వేగ పరిమితిని మించిన వాహనాన్ని డ్రైవ్ చేశాడు ధోనీ. దీనికి 1,000 రూపాయాల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ధోనీ వాహనం ఓవర్ స్పీడ్ తో వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 183 కింద ఆయనపై ఈ-చలాన్ ఇచ్చారు.
రాంచీ సిటీలోని ఆటోమేటెడ్ ట్రాఫిక్ విజిలెన్స్ సిస్టమ్ దీన్ని రికార్డు చేసింది. వారం రోజుల్లో ధోనీకి ఎదురైన రెండో చట్టపరమైన సమస్య ఇది. దీనికి ముందు నివాస ప్లాట్‌ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై జార్ఖండ్ స్టేట్ హౌసింగ్ బోర్డు ఆయనకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. రాంచీలోని హర్ము రోడ్‌లో ఉన్న స్థలాన్ని రెసిడెన్షియల్ అవసరాలకు బదులు కమర్షియల్ కార్యకలాపాలకు వినియోగించారని నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుత రింగ్ రోడ్ ఇంటికి మారకముందు ధోనీ అక్కడే నివసించేవారు.
మరోవైపు ఐపీఎల్ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 1న చెన్నై సూపర్ కింగ్స్ హైపెర్ఫార్మెన్స్ సెంటర్‌లో జరిగిన మొదటి ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ, కేప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి పాల్గొన్నారు. అసిస్టెంట్ కోచ్‌లు శ్రీధరన్ శ్రీరామ్, రాజీవ్ కుమార్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ గ్రెగ్ కింగ్ ప్రస్తుతం సెషన్‌లను పర్యవేక్షిస్తున్నారు. నెట్ ప్రాక్టీస్‌లో ధోనీ సరదాగా గడుపుతున్నాడు.
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
IPL 2026 Second Phase Schedule: ఐపీఎల్ రెండో విడత షెడ్యూల్-50 మ్యాచ్ ల తేదీలివే..! -
ఈసారి IPL 2026 Opening Ceremony లేదా ? ఏం జరుగుతోంది ? -
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications