MS Dhoni: ఐపీఎల్ రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చిన ఎంఎస్ ధోని
MS Dhoni: క్రికెట్ అభిమానులు ప్రతి ఏడాది ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీనికి కారణం ఎంఎస్ ధోని అన్నా అతిశయోక్తి లేదు. చాలా మంది ఫ్యాన్స్ ధోని కోసం ఐపీఎల్ చూస్తూ ఉంటారు. ఎంఎస్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ధోని ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతాడనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. గత సీజన్ లోనూ ఇదే మాటలు విని అలసిపోయిన ఫ్యాన్స్ లో జోష్ నింపుతూ 18వ సీజన్ కు రెడీ అయిపోయాడు.
రిటైర్మెంట్ గురించి ధోని క్లారిటీ
ఈ సీజన్ లో ధోని ఎక్కువ వయస్సున్న ఆటగాడిగా ఉన్నాడు. ప్రస్తుతం ధోని వయస్సు 43 సంవత్సరాలు. ఇది ధోనికి చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా అనే ప్రశ్న మళ్లీ తలెత్తుతోంది. ఈ సీజన్ తర్వాత ధోని రిటైర్ అవుతాడని గుసగుసలు ప్రారంభం కావడంతో ధోని తన భవిష్యత్ గురించి కీలక ప్రకటన చేశాడు. ఈ సీజన్ ప్రారంభంలోనే ధోని ఈ విషయంపై తన మౌనాన్ని వీడాడు. తాజాగా ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ నేపథ్యంలో ధోని స్వయంగా తన రిటైర్మెంట్ వార్తలను కొట్టిపడేశాడు. చెన్నైకి తన సేవలు కావాల్సినంత వరకు ఆడతానని.. ఇది నా ఫ్రాంచైజీ అని.. తాను వీల్ చైర్ లో ఉన్నా ఫ్రాంచైజీ తనను లాక్కెళ్లి పోతుందని.. ఎన్నాళ్లు ఆడాలనుకుంటే అంతకాలం ఆడతానని ఎంఎస్ ధోని స్పష్టం చేశాడు.

వీల్ చైర్ మీద ఉన్నా..
జియో హాట్ స్టార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని రిటైర్మెంట్ గురించి కీలక ప్రకటన చేయడం గమనార్హం. "చెన్నై సూపర్ కింగ్స్ నా ఫ్రాంచైజీ. సీఎస్కే తరఫున మరింతకాలం ఆడాలని అనుకుంటున్నాను. ఒకవేళ వీల్ ఛైర్‌లో ఉన్న సరే ఫ్రాంచైజీ నన్ను లాక్కెళ్లిపోతుంది." అని ధోని స్పష్టం చేశాడు. ధోని ప్రకటనను బట్టి భవిష్యత్తులో కూడా ఐపీఎల్ ఆడటం కొనసాగిస్తాడని తెలుస్తోంది. దీంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ సారి ఎంఎస్ ధోని పూర్తి స్థాయిలో ఫిట్ నెస్‌లో కనిపిస్తున్నాడు. ఈ సారి బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుగా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
గైక్వాడ్ కీలక ప్రకటన
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ధోని గురించి కీలక ప్రకటన చేశాడు. ధోని ఇంకా చాలా సంవత్సరాలు ఐపీఎల్ లో ఆడాలని రుతురాజ్ గైక్వాడ్ ఆకాంక్షించాడు. సచిన్ టెండూల్కర్ ను ఉదాహరణగా చూపిస్తూ.. సచిన్ 50 ఏళ్ల వయస్సులోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని.. కాబట్టి ధోనికి కూడా చాలా సంవత్సరాలు మిగిలి ఉన్నాయని తాను భావిస్తున్నానన్నారు. ఇటీవల సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్ లో ఆడుతూ కనిపించాడు. సచిన్ టెండూల్కర్ ఆ లీగ్ లో అద్భుతంగా రాణించాడు.
MS Dhoni said "I can play for as long as I want for CSK - That is my franchise. Even if I am in a wheelchair, they will drag me". [Big smile - JioHotstar] pic.twitter.com/8CaDdRAS9p
— Johns. (@CricCrazyJohns) March 23, 2025












Click it and Unblock the Notifications