ఈయన వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్స్ మూటా ముల్లె సర్దుకోక తప్పదేమో
ఈ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పరిస్థితి అధ్వాన్నం. ఏదీ కలిసి రావట్లేదు. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచ్ లల్లో నాలుగింట్లో ఓడింది. నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్ లల్లో విజయాలు సాధించి గాడినపడిందనుకునే లోపే సన్ రైజర్స్ హైదరాబాద్ రూపంలో భారీ అడ్డంకి ఎదురొచ్చింది. దీన్ని అధిగమించలేక చతికలిపడిందా మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్.
ఈ పరిణామాల మధ్య నేడు ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ఆడబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్. వాంఖెడే స్టేడియం దీనికి వేదిక. ఈ రెండు జట్ల పరిస్థితీ అంతంతమాత్రమే. ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ ఆడట్లేదు. గాయం కారణంగా తప్పుకొన్నాడు. మొన్నటి మ్యాచ్ లో కూడా అందుబాటులో లేడు. నేడు జరిగే మ్యాచ్ లోనూ అతను ఆడేది అనుమానమే. అతని స్థానంలో విల్ జాక్స్ ఆడే అవకాశం ఉంది.

అటు చెన్నై సూపర్ కింగ్స్ కు కూడా ధోనీ కూడా అందుబాటులో ఉండట్లేదు. అదిగో ఇదిగో అంటూ ప్రతి మ్యాచ్ కూ దాటవేస్తోన్నాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ స్టార్ బ్యాటర్ ఆయుష్ మాత్రే దూరం అయ్యాడు. చెన్నై జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఇతనొక్కడే. హామ్‌స్ట్రింగ్ గాయంతో ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. మొదట్లో మూడు వారాల పాటు అందుబాటులో ఉండబోడని భావించినప్పటికీ.. అది రివర్స్ అయింది.
ఎన్నో ఆశలు పెట్టుకున్న మహేంద్ర సింగ్ ధోనీ రికవరీ సైతం చాలా టైమ్ తీసుకుంటోంది. అతను ఆడటంపై అనిశ్చితి నెలకొంది. చెన్నైలో ప్రీసీజన్ సెషన్స్ లో కాలి పిక్క కండరాల గాయం కారణంగా ఈ 44 ఏళ్ల ఆటగాడు సీజన్‌లో తొలి ఆరు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇటీవల నెట్స్‌లో బ్యాటింగ్, వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించడంతో అతని పునరాగమనంపై ఆశలు చిగురించాయి. అయినప్పటికీ ధోనీ విషయంలో సీఎస్కే ఆచితూచి వ్యవహరిస్తోంది.
మ్యాచ్‌కు ముందు తుది నిర్ణయం తీసుకుంటామని బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ తెలిపారు. ధోని పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడా లేదా అనే దానిపై అనిశ్చితి ఉందని తేల్చి చెప్పారు. ధోని కోలుకుంటున్నారని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ధృవీకరించినా, అతని పునరాగమనంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ధోనీ నెమ్మదిగా కోలుకుంటున్నాడని. ఎప్పుడు ఆడతాడనేది తెలియదని పేర్కొననాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు పెద్దగా రాణించింది లేదు. అయిదు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించింది. పేలవమైన ఆరంభం తర్వాత కోలుకుంటున్నప్పటికీ, మాజీ కెప్టెన్ ధోని అనుభవం, నాయకత్వ లేమి జట్టుకు స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయాల తర్వాత, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమితో మళ్లీ వెనుకంజలో పడింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉందీ జట్టు.












Click it and Unblock the Notifications