Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

MS Dhoni: ఎంఎస్ ధోని మ్యాజిక్.. రెప్పపాటులో సూర్య కుమార్ యాదవ్ ఔట్!(వీడియో)

MS Dhoni: ఐపీఎల్ 2025లో సీఎస్కే, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఎంఎసో ధోని తన అద్భుతమైన వికెట్ కీపింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను క్షణంలో స్టంప్ ఔట్ చేశాడు. ఈ అద్భుతం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగింది. ధోని చేసిన ఈ అద్భుతం క్రికెట్ ప్రియులను ఆశ్చర్యపరిచింది. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్టంపింగ్ లు(44) చేసిన ఆటగాడిగా ధోని నిలిచాడు. ముంబైపై ఎంఎస్ ధోని చాకచక్యంగా వ్యవహరించాడు.

బంతిని స్లిప్ చేసిన నూర్ అహ్మద్
స్పిన్నర్ నూర్ అహ్మద్ మూడో ఓవర్ వేస్తున్నాడు. అప్పుడు సూర్యకుమార్ యాదవ్ క్రీజు ముందుకు వెళ్లి షాట్ కొట్టాలనుకున్నాడు. కానీ ధోని త్వరగా బెయిల్స్ తొలగించాడు. ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్ కాలు క్రీజు బయట ఉంది. ధోని సూర్యకుమార్ యాదవ్ ను క్షణాల్లో స్టంప్ ఔట్ చేశాడు. ధోని చేసినఈ స్టంపింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కామెంటేటర్స్ కూడా ధోనిని ప్రశంసించడం ప్రారంభించారు. ధోనిని బెస్ట్ వికెట్ కీపర్ గా ఎందుకు భావిస్తారో మరోసారి నిరూపించాడు.

MS Dhoni Magic Surya Kumar Yadav Stumped in a Flash Video goes Viral

ఐపీఎల్ లో అత్యధిక స్టంపింగ్ లు చేసిన వికెట్ కీపర్లు
ఎంఎస్ ధోని - 44 స్టంపింగ్‌లు
దినేష్ కార్తీక్ - 37 స్టంపింగ్‌లు
రాబిన్ ఉతప్ప - 32 స్టంపింగ్‌లు
వృద్ధిమాన్ సాహా - 26 స్టంపింగ్‌లు
రిషబ్ పంత్ - 23 స్టంపింగ్‌లు

పరిస్థితిని మార్చేసిన ధోని స్టంపింగ్
43 ఏళ్ల వయసులో కూడా ధోని వికెట్ కీపింగ్ మాయాజాలం చెక్కుచెదరకుండా ఉంది. ధోని స్పీడ్, గొప్పశైలి తలైవాను ప్రత్యేకం చేస్తాయి. సూర్యకుమార్ యాదవ్ స్టంపింగ్ సీఎస్కేకు గేమ్-ఛేంజర్ గా నిరూపించబడింది. సూర్య ఔట్ అయిన వెంటనే ముంబై జట్టు రాబిన్ మింజ్, తిలక్ వర్మ రూపంలో మరో రెండు దెబ్బలు తిన్నది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+