Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జస్ట్.. రెండే రెండు ఓవర్లు- సునామీ పుట్టించాయి..!!

IPL 2025 Playoffs: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్.. కీలక మ్యాచ్ ఆడుతోంది. ఢిల్లీ కేపిటల్స్ తో తలపడుతోంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచితీరాల్సిన పరిస్థితిలో ఈ రెండు జట్లూ ఉన్నాయి. ముంబై గెలిస్తే- నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. ఓడితే మాత్రం.. ఢిల్లీ గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది.

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగింది ముంబై. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్ లో టాప్ స్కోరర్.. సూర్యకుమార్ యాదవ్. తనదైన శైలిలో విరుచుకుపడ్డాడీ ముంబైకర్. నమన్ ధీర్ తో కలిసి స్టేడియంలో విధ్వంసాన్ని సృష్టించాడు.

Mumbai Indians scored 180 5 against Delhi Capitals in must win match to Qualify IPL 2025 Playoffs

43 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, ఏడు బుల్లెట్ల వంటి ఫోర్లతో 73 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో కూడా ఘోరంగా విఫలం అయ్యాడు. అయిదు పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్- 25, టాప్ ఆర్డర్ బ్యాటర్ విల్ జాక్స్- 21, తిలక్ వర్మ- 27, కేప్టెన్ హార్దిక్ పాండ్యా- 3 పరుగులు చేశారు. చివర్లో నమన్ ధీర్ సుడిగాలి ఇన్నింగ్ ఆడాడు. 8 బంతులను ఎదుర్కొన్న ఈ బ్యాటర్ ఏకంగా 24 పరుగులు సాధించాడు. ఇందులో రెండు చొప్పున ఫోర్లు, సిక్సర్లు ఉన్నాయి.

సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ చివరి రెండు ఓవర్లల్లో తుఫాన్ లా విరుచుకుపడ్డారు బౌలర్లపై. చెలరేగి ఆడారు. ఈ చివరి రెండు ఓవర్లల్లోనే ఏకంగా 48 పరుగులు పిండుకున్నారంటే వాళ్ల బ్యాటింగ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పోటీ పడి సిక్సర్లు, బౌండరీలు బాదారు.

ముఖేష్ కుమార్ వేసిన 19వ ఓవర్ లో 27 పరుగులు రాబట్టుకున్నారు. ఆ ఓవర్ తొలి బంతిని సూర్యకుమార్ యాదవ్ సిక్స్ గా మలిచాడు. రెండో బంతికి సింగిల్ తీశాడు. ఆ తరువాత చివరి నాలుగు బంతుల్లో నమన్ ధీర్ 20 పరుగులు రాబట్టుకున్నాడు. 4,6,6,4 కొట్టాడా నాలుగు బంతుల్లో.

దుష్మత చమీరా వేసిన చివరి ఓవర్ లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. తొలి బంతిని బౌండరీకి పంపించిన సూర్యకుమార్ యాదవ్.. 3, 4 బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. అయిదో బంతిని బౌండరీ దాటించాడు. ఆరో బంతికి సింగిల్ తీశాడు. 19 ఓవర్ ఆరంభానికి ముందు 132 పరుగుల మీద ఉన్న ముంబై ఇండియన్స్ స్కోర్.. ఈ చివరి రెండు ఓవర్లు ముగిసే సరికి 180కి చేరింది.

ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ విశ్వరూపం కనిపించింది. చాలా స్వేచ్ఛగా ఆడాడు. క్రికెటింగ్ షాట్లు కొట్టాడు. కుల్ దీప్ యాదవ్ బౌలింగ్ లో ముఖేష్ కుమార్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన సూర్య.. ఆ తరువాత యథేచ్ఛగా ఆడాడు. బౌలర్లను ఉతికి ఆరేశాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+