Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐపీఎల్‌ 2024లో రెంటికీ చెడ్డ రేవడు

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. థ్రిల్లర్స్‌ను తలపిస్తోన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లో ఘన విజయాలను సాధించింది. నాలుగు పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.

సీఎస్‌కే తరహాలోనే రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటుతోంది. ఆడిన రెండింట్లోనూ గెలుపు బావుటా ఎగురవేసింది. నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది సంజు శాంసన్ టీమ్. గురువారం రాత్రి జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ను 12 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌లో, అనంతరం బౌలింగ్‌లో రాణించిందీ జట్టు.

Mumbai Indians stands in bottom in the IPL 2024 Points Table with zero points

టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇప్పటివరకూ బోణీ చేయలేదు. ఆడిన రెండింట్లోనూ తన ప్రత్యర్థుల చేతిలో చిత్తయింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు బోణీ కొట్టని జట్లు ఏవైనా ఉన్నాయా అంటే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్సే.

రోహిత్ శర్మకు కేప్టెన్సీ తొలగించిన తరువాత ఎదుర్కొంటోన్న తొలి ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లల్లో చతికిల పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముంబై ఇండియన్స్‌ను మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ టీమ్‌‌గా, అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ను కేప్టెన్సీ నుంచి తప్పించిన ప్రభావం జట్టు ఆటతీరుపై పడుతోందనేది రుజువైనట్టే.

ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌కు కప్‌ అందించాడు హార్దిక్ పాండ్యా. 2022లో ఐపీఎల్‌లో అడుగు పెట్టిన గుజరాత్ టైటాన్స్.. అదే ఏడాది ఛాంపియన్‌గా నిలిచింది. 2023లోనూ ఫైనలిస్ట్‌గా నిలిచింది. అవే సీజన్‌లల్లో ముంబై ఇండియన్స్ దారుణంగా ఆడింది. ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. ఈ రెండు కారణాలతో ముంబై ఫ్రాంఛైజీ తమ జట్టుకు హార్దిక్‌ను కేప్టెన్‌గా అపాయింట్ చేసిందనేది తెలిసిన విషయమే.

తీరా బరిలో దిగాక హార్దిక్ పాండ్యా చేతులెత్తేశాడు. అంచనాలకు తగ్గట్టుగా ఏ మాత్రం రాణించట్లేదు. బ్యాటర్‌గా, కేప్టెన్‌గా విఫలం అయ్యాడని తొలి రెండు మ్యాచ్‌ల రిజల్ట్ బట్టి అర్థం చేసుకోవచ్చు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో అది స్పష్టంగా కనిపించింది. ఒకదశలో రోహిత్ శర్మపై డిపెండ్ అయ్యాడు హార్దిక్.

ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఎదుర్కొనాల్సి ఉంది. ముంబై వాంఖెడే స్టేడియం దీనికి వేదిక. ఏప్రిల్ 1వ తేదీన షెడ్యూల్ అయిన మ్యాచ్ ఇది. సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది. ప్రస్తుతం ఆడిన రెండింట్లోనూ నెగ్గి కాకమీద ఉంది ఆర్ఆర్. ఆ జట్టును ముంబై ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+