భారత్ తలపడబోయే న్యూజిలాండ్ కొదమసింహాలు వీళ్లే.. జట్టు ప్రకటన: స్ప్లిట్ స్క్వాడ్ వ్యూహం.. !!

భారత్‌తో జరగనున్న అయిదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన జట్టును ప్రకటించింది. నవంబర్ 4న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ స్టేడియంలో మొదటి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సుదీర్ఘ సిరీస్ ఆడే న్యూజిలాండ్ జట్టుకు ఆల్‌రౌండర్ మిఛెల్ శాంట్నర్ కేప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రాబోయే టెస్ట్ సిరీస్, ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఈ సిరీస్ కోసం రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేయడం విశేషం.

భారత్‌ను సొంత గడ్డపై ఎదుర్కొనడానికి కివీస్ స్ప్లిట్ స్క్వాడ్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. తొలి మూడు మ్యాచ్‌లకు ఒక జట్టు, మిగిలిన రెండింటికీ మరో జట్టును ఎంపిక చేసింది క్రికెట్ న్యూజిలాండ్. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ కాంబినేషన్ ఇందులో కనిపించింది. భుజం గాయం కారణంగా ఇటీవలి టీ20 సిరీస్‌కు దూరమైన ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రను తొలి మూడు వన్డేల కోసం జట్టులోకి తీసుకున్నారు. అతనితో పాటు టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, డారిల్ మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్ వంటి సీనియర్ ఆటగాళ్లు మొదటి విడత మ్యాచ్‌లలో బరిలోకి దిగనున్నారు.

New Zealand announce their ODI squad for the series against India under Mitchell Santner Captaincy

చివరి రెండు వన్డేల కోసం న్యూజిలాండ్ ముగ్గురు కీలక ఆటగాళ్లను జట్టులో చోటు కల్పించింది. విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్, ఫాస్ట్ బౌలర్ లోకీ ఫెర్గూసన్, వికెట్ కీపర్ టిమ్ సీఫర్ట్ వన్డే జట్టులో స్థానం సంపాదించారు. మొదటి మూడు మ్యాచ్ లల్లో వీరికి చోటు దక్కలేదు. చివరి రెండు మ్యాచ్ లు ఆడతారు. చాలాకాలం తర్వాత ఫెర్గూసన్ గానీ సీఫర్ట్ గానీ వన్డే జట్టులో రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫెర్గూసన్ చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్‌పై ఆడాడు. దాదాపు 18 నెలల విరామం తర్వాత టిమ్ సీఫర్ట్ తిరిగి జట్టులోకి వచ్చాడు.

ఆ ఆల్ రౌండర్ అవుట్.. నితీష్ రెడ్డి ఇన్: వెస్టిండీస్ తో నేడే మూడో టీ20: మళ్లీ పరుగుల జాతరే?
ఆ ఆల్ రౌండర్ అవుట్.. నితీష్ రెడ్డి ఇన్: వెస్టిండీస్ తో నేడే మూడో టీ20: మళ్లీ పరుగుల జాతరే?

గాయాల సమస్యలు కివీస్ బౌలింగ్ విభాగాన్ని వేధిస్తోన్నాయి. యంగ్ ఫాస్ట్ బౌలర్లు జాక్ ఫౌల్క్స్, విల్ ఓరూర్కే, బెన్ సీర్స్ గాయాల వల్ల ఈ సిరీస్‌కు దూరం అయ్యారు. తొడ కండరాలు, పిక్కలు, మడమ గాయాలతో బాధపడుతున్న ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం రిహాబిలిటేషన్ లో కోలుకుంటోన్నారు. యంగ్ పేసర్లు అందుబాటులో లేకపోవడం న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ వ్యూహాలపై కొంత వరకు ప్రభావం చూపే అవకాశం ఉంది.

ముమ్మాటికీ అంగీకారం కాదు: సౌదీ అరేబియా ఉదంతంపై తేల్చి చెప్పిన కేంద్రం
ముమ్మాటికీ అంగీకారం కాదు: సౌదీ అరేబియా ఉదంతంపై తేల్చి చెప్పిన కేంద్రం

తొలి మూడు వన్డేల జట్టులో.. : మిఛెల్ శాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, కైలె జేమిసన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, విల్ యంగ్, బ్లెయిర్ టిక్నర్ ఎంపికయ్యారు.

చివరి రెండు వన్డేల జట్టు: మిఛెల్ శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మ్యాట్ ఫిషర్, లోకీ ఫెర్గూసన్, మిచ్ హే (వికెట్ కీపర్), నిక్ కెల్లీ, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్ కు చోటు దక్కింది.

న్యూజిలాండ్ జట్టు గతంలో భారత గడ్డపై 2-1 తేడాతో చారిత్రాత్మక వన్డే సిరీస్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. భారత్ పై ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలవడం కివీస్ చరిత్రలో అదే తొలిసారి. ఈ వన్డే సిరీస్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ బోర్డు నవంబర్ ప్రారంభంలో 14 మంది సభ్యులతో కూడిన టెస్ట్ జట్టును ప్రకటించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+