భారత్ వైట్ వాష్- స్టార్ క్రికెటర్ గుడ్‌బై
Tim Southee: టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను సొంత గడ్డపై ఓడించిన జోష్‌లో ఉంది న్యూజిలాండ్. ఇక ఇంగ్లాండ్‌తో పోరాటానికి సర్వ సన్నాహాలు పూర్తి చేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టబోతోంది. తొలి మ్యాచ్ ఈ నెల 28వ తేదీన ఆరంభం కానుంది.
క్రైస్ట్‌చర్చ్‌లోని హగ్లే ఓవల్ స్టేడియం దీనికి వేదిక. భారత కాలమానం ప్రకారం- 28వ తేదీన తెల్లవారు జామున 3:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. డిసెంబర్ 6న రెండో మ్యాచ్ వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్, అదే నెల 14వ తేదీన హామిల్టన్ సెడాన్ పార్క్ స్టేడియంలో మూడో మ్యాచ్ జరుగుతుంది. ఇందులో కూడా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది న్యూజిలాండ్. భారత్‌పై సాగించిన జైత్రయాత్రను ఇక్కడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.

ఈ పరిస్థితుల మధ్య న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ.. రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. టెస్ట్ ఫార్మట్ నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఈ ఫార్మట్ నుంచి రిటైర్ కానున్నాడు టిమ్ సౌథీ. న్యూజిలాండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరితే.. ఆ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు.
డిసెంబర్ 14వ తేదీన ఇంగ్లాండ్‌తో హామిల్టన్ సెడాన్ పార్క్ స్టేడియంలో మొదలయ్యే మూడో టెస్ట్.. టిమ్ సౌథీకి చివరిది అవుతుంది. 2008 మార్చ్ 22వ తేదీన టెస్టుల్లో అరంగేట్రం చేశాడు సౌథీ. ఇప్పటివరకు 104 మ్యాచ్‌లు ఆడాడు. 385 వికెట్లను పడగొట్టాడు. ఈ ఫార్మట్‌లో న్యూజిలాండ్ తరఫున అతనే రెండో హయ్యెస్ట్ వికెట్ టేకర్.
ఇంగ్లాండ్‌తో మూడు టెస్ట్ మ్యాచ్‌లల్లో రాణించగలిగితే టిమ్ సౌథీ 400 వికెట్ల క్లబ్‌లో చేరడం ఖాయం. దీనికి 15 వికెట్ల దూరంలో నిలిచాడీ పేస్ బౌలర్. ఇటీవలే ముగిసిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 3-0 తేడాతో వైట్ వాష్‌కు గురి కావడంలోనూ కీలక పాత్ర పోషించాడు. పుణేలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్‌లో అయిదు వికెట్లు నేలకూల్చాడు.












Click it and Unblock the Notifications