కేప్టెన్సీకి గుడ్‌బై
Tim Southee: నిన్నటి వరకు టెస్ట్ సిరీస్‌లో తీరిక లేకుండా గడిపింది భారత క్రికెట్ జట్టు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచుల్లోనూ విజయకేతనాన్ని ఎగురవేసింది. ఈ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. ఈ రెండింట్లోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది బంగ్లాదేశ్.
ఇక భారత్- టెస్ట్ మ్యాచ్‌లల్లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొనాల్సి ఉంది. ఇంకొద్ది రోజుల్లో న్యూజిలాండ్ భారత పర్యటనకు రాబోతోంది. టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఢీ కొట్టబోతోంది. మొత్తం మూడు మ్యాచ్‌ల సిరీస్ ఇది. ఈ నెల 16న తేదీ ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక.

24వ తేదీన పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నవంబర్ 1వ తేదీన ముంబై వాంఖెడే స్టేడియంలల్లో చివరి రెండు టెస్టులు షెడ్యూల్ అయ్యాయి. మ్యాచ్‌లన్నీ కూడా ఉదయం 9:30 గంటలకు ఆరంభమౌతాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇవి జరుగనున్నాయి.
ఈ పరిణామాల మధ్య న్యూజిలాండ్ క్రికెట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టెస్ట్ ఫార్మట్ కేప్టెన్ టిమ్ సౌథీ తన పదవిని వదులుకున్నాడు. సారధ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. అతని స్థానంలో ఓపెనర్ టామ్ లాథమ్ అపాయింట్ అయ్యాడు. కేప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు.
2022లో అప్పటి కేప్టెన్ కేన్ విలియమ్సన్ నుంచి టెస్ట్ ఫార్మట్ కేప్టెన్‌గా బాధ్యతలను అందుకున్నాడు సౌథీ. అతని సారథ్యంలో న్యూజిలాండ్ మొత్తం 14 మ్యాచ్‌లను ఆడింది. అందులో ఆరింట్లో నెగ్గింది. రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. శ్రీలంకతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను కోల్పోవడం సౌథీపై ఒత్తిడి పెంచింది.
ఈ క్రికెటింగ్ సీజన్‌లో అతని బౌలింగ్ ప్రదర్శన అంచనాలకు అనుగుణంగా ఉండట్లేదు. ఇప్పటివరకు అతను పడగొట్టిన వికెట్లు 12. అదే సమయంలో భారత్ వంటి బలమైన జట్టుతో ఢీ కొట్టాల్సి ఉండటం వల్ల బౌలింగ్‌ను మెరుగుపర్చుకునే క్రమంలో టెస్ట్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగినట్లు కివీస్ బోర్డ్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications