నితీష్ కుమార్ రెడ్డి గాయం

భారత జట్టు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతోన్న రెండో వన్డే మ్యాచ్‌కు దూరం అయ్యాడు. వన్డే సిరీస్ లో భాగంగా లక్నో అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు రెండో మ్యాచ్ లో హష్మతుల్లా షాహిదీ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ను ఎంచుకుంది.

ఈ మ్యాచ్ టాస్ సమయంలో నితీష్ కుమార్ రెడ్డి గాయంపై స్పష్టత వచ్చింది. టాస్ సమయంలో శుభ్‌మన్ గిల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. అతను అందుబాటులో లేకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. నితీష్ ఎడమ తొడ కండరాల నొప్పితో (క్వాడ్ ఇష్యూ) బాధపడుతున్నట్లు గిల్ వివరించాడు. దీనిపై బీసీసీఐ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. నితీష్ గాయపడ్డ విషయాన్ని అధికారిక నిర్ధారించింది.

Nitish Kumar Reddy Ruled Out of India vs Afghanistan 2nd ODI With Quad Injury BCCI Confirms

నితీష్ ఎడమ తొడ నొప్పితో బాధపడుతున్నందున తుదిజట్టులో ఎంపిక కాలేదని తెలిపింది. బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని వివరించింది. నితీష్ అందుబాటులలో లేకపోవిడంతో జట్టులో మార్పులు జరిగాయి. ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా వన్డే ఇంటర్నేషనల్స్ లో అరంగేట్రం చేసే సువర్ణావకాశాన్ని పొందాడు. అతనితో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ తిరిగి తుది జట్టులోకి వచ్చారు.

స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వారసుడిగా నితీష్ కుమార్ రెడ్డిని క్రీడా విశ్లేషకులు చాలా కాలంగా భావిస్తూ వస్తోన్నారు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడీ ఆల్ రౌండర్. తక్కువ సమయంలోనే జాతీయ జట్టులో కీలక స్థానాన్ని సంపాదించుకున్నాడు. కెరీర్ ఊపందుకుంటున్న తరుణంలోనే గాయాల బారిన పడటం జట్టు వ్యూహాలపై ప్రభావం చూపుతోంది. రాబోయే కీలక టోర్నమెంట్లు, విదేశీ పర్యటనలను దృష్టిలో ఉంచుకుని నితీష్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+