భారత్- పాకిస్తాన్ మ్యాచ్ లపై కేంద్రం తుది నిర్ణయం- క్లియర్ కట్ తేలిపోయింది
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025కు గడువు సమీపించింది. ఇంకో మూడు రోజులే మిగిలివుంది. ఈ నెల 9వ తేదీన ఈ టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. దీనికి వేదిక. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి.
మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టోర్నమెంట్ లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ గ్రూప్- ఏలో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంగ్ కాంగ్ గ్రూప్ బీలో భాగం అయ్యాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ ఫోర్స్ దశకు అర్హత సాధిస్తాయి.
మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమౌతాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండేది. దీన్ని అరగంట ముందుకు జరిపింది.

ఒక్క మ్యాచ్ మినహా మిగిలినవన్నీ కూడా రాత్రి 8 గంటలకు మొదలవుతాయి. సెప్టెంబర్ 15న అబుదాబిలో యూఏఈ, ఒమన్ మధ్య జరిగే మ్యాచ్ మాత్రం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:00 గంటలకు అంటే-భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 జరుగుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుంది.
పాకిస్తాన్ తో మ్యాచ్ ఉంటుందా? లేదా? అనే అనుమానాలకు తెర పడింది. ఆసియా కప్ లో భారత్.. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడుతుందని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. భారత ఆడబోయే మ్యాచ్ లకు ఎటువంటి ఆంక్షలు లేవని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ యధాతథంగా జరుగుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కొత్త క్రీడా విధానం ప్రకారం.. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు ఉండవు. ఆసియా కప్ వంటి టోర్నమెంట్లకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. ద్వైపాక్షిక సిరీస్ మినహా మరే ఇతర ఈవెంట్ లో అయినా ఈ భారత్- పాకిస్తాన్ మ్యాచ్ లు ఆడే వెసలుబాటు కల్పించింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే మ్యాచ్ ఉంటుందని దేవజిత్ సైకియా తెలిపారు. ఆసియా కప్ లో భారత ఉప ఖండం పరిధిలో క్రికెట్ ఆడే అన్ని దేశాలు తలపడతాయని, ఇలాంటి టోర్నీకు కేంద్రం మినహాయింపు ఇచ్చిందని వివరించారు.
ఆసియా కప్ కు ఎంపికైన భారత జట్టులో- సూర్య కుమార్ యాదవ్ (కేప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కేప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్ ఉన్నారు.
స్టాండ్‌బై: యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)












Click it and Unblock the Notifications