Australian Open 2025: జకోవిచ్ కు ఏమైంది.. ఆట మధ్యలో అలా ఎలా..?

టెన్నిస్ ఫ్యాన్స్ కు మింగుడు పడని వార్త. లెజెండరీ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 నుంచి అనూహ్యంగా వైదొలిగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఎప్పటిలాగే స్వదేశానికి కప్పు తీసుకొస్తాడనుకున్న సెర్బియా ప్రజలకు ఇప్పుడు జొవాక్ జకోవిచ్ తీసుకున్న నిర్ణయం మింగుడు పడడం లేదు.

కారణం ఇదే..

నొవాక్ జకోవిచ్ ప్రస్తుతం అలెగ్జాండర్ జ్వెరెవ్ తో సెమీస్ లో తలపడాల్సి ఉంది. సెమీస్ లో ఫస్ట్ సెట్ లో 6(5)-7(7) తేడాతో ఓడిన సెర్బియన్ వీరుడు.. ఆ తర్వాత తాను ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలిపారు. గాయం కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Novak Djokovic Pulls Out of Australian Open 2025 Semis Due to Injury

క్వార్టర్ ఫైనల్ లో స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ తో తలపడిన నొవాక్ ఆ మ్యాచ్ లో విజయం సాధించాడు. ఆ సమయంలోనే అతడు గాయపడ్డాడు. మోకాలి పైభాగంలో గాయం అయినట్లు తెలుస్తోంది. గాయంతోనే ఆ మ్యాచ్ గెలిచాడు నొవాక్. ఆ తర్వాత గాయం అధికం కావడంతో సెమీ ఫైనల్ కు ముందు చేయాల్సిన ట్రైయినింగ్ సెషన్ ను కూడా మానేసి రెస్ట్ తీసుకున్నాడు.

అయితే సెమీస్ కావడం వల్ల లాస్ట్ మినెట్ లో ఆండీ ముర్రేతో 90 నిమిషాలు ప్రాక్టీస్ చేశాడు. అయితే అదే దృఢసంకల్పంతో సెమీస్ లోనూ విజయం సాధిస్తాడని జకోవిచ్ కోచింగ్ స్టాఫ్ భావించింది. కానీ జ్వెరెవ్ తో సెమీస్ లో జరిగిన ఫస్ట్ సెట్ లో అతడి గాయం తీవ్రతరమైంది. దీంతో జకోవిచ్ ఆట మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. జకోవిచ్ షాకింగ్ నిర్ణయం.. ఒక్కసారిగా జ్వెరెన్ ను కూడా విస్మయానికి గురిచేసింది. స్టేడియంలోని ఫ్యాన్స్ కు థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ జకోవిచ్ లాకర్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. స్టేడియంలోని ఫ్యాన్స్ గట్టిగా అరవడం ప్రారంభించగా జ్వెరెవ్ వాళ్లను.. ఇలా చేయడం కరెక్ట్ కాదని వారించాడు.

ఇక నొవాక్ జకోవిచ్ నిష్క్రమణతో జ్వెరెవ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్- 2025 మెన్స్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. వుమెన్స్ ఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+