భూమి తన ఆకర్షణ శక్తిని కోల్పోయిన క్షణం?

Paris Olympics Viral Photo: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఓ అద్భుత దృశ్యం క్యాప్చర్ అయింది. బ్రెజిల్ సర్ఫర్ గాబ్రియెల్ మెడినాకు చెందిన ఫొటో అది. ఫ్రాన్స్‌కు చెందిన టాప్ మీడియా హౌస్ ఏజెన్స్ ఫ్రాన్స్-ప్రెస్సె (AFP) ఫొటో గ్రాఫర్ జెరోమ్ బ్రోలెట్టె.. దీన్ని తన కెమెరాలో బంధించాడు.

ఈ ఫొటో మొత్తం పారిస్ ఒలింపిక్స్ మొత్తాన్నీ డామినేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఫొటోను లక్షలమంది చూశారు. అత్యధికులు చూసిన ఫొటోగా రికార్డు సృష్టించింది. ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ముగిసేసరికి.. మోస్ట్ వ్యూస్ సాధించిన ఫొటోగా అగ్రస్థానాన్ని అందుకోవచ్చు.

One of the most viral image of Brazil s surfer Gabriel Medina from the Paris Olympics 2024

సర్ఫింగ్ చేస్తోన్న సమయంలో గాబ్రియెల్ మెడినా.. ఆయన వినియోంచిన సర్ఫింగ్ బోర్డ్.. అలల తాకిడికి ఒకేసారి గాల్లోకి లేచాయి. సమాంతరంగా నిలిచిన క్షణంలో వందోవంతులో జెరోమ్ బ్రోలెట్టె తన కెమెరాను క్లిక్‌మనిపించాడు. దీన్ని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

క్షణాల్లో వైరల్‌గా మారిందీ పిక్. లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. నడిసముద్రంలో అలలకు సుమారు ఓ రెండడుగుల ఎత్తులో తన కుడిచేతిని గాల్లోకి పైకి లేపి నిల్చున్న గాబ్రియెల్ ఒకవైపు.. అతనికి సమాంతరంగా గాల్లోకి లేచిన సర్ఫింగ్ బోర్డ్ మరో వైపు కనిపించాయి ఇందులో. భూమి మీద ఓ కటౌట్‌ను నిలబెట్టినట్టుగా ఉందా పిక్.

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో తాహితీ తీరంలో ప్యారిస్ ఒలింపిక్స్ సర్ఫింగ్ గేమ్స్‌ను ఏర్పాటు చేశారు. పురుషుల షార్ట్‌ బోర్డ్ సింగిల్స్ కేటగిరీ మూడవ రౌండ్‌లో గాబ్రియేల్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మొదటి రౌండ్ హీట్స్‌లో 13.50 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచిన ఈ బ్రెజిలియన్.. మూడో రౌండ్‌ను 9.90 స్కోర్‌తో ముగించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+