నీ పనైపోయింది ఆజామూ
Babar Azam: పాకిస్తాన్ మాజీ కేప్టెన్ బాబర్ ఆజమ్.. ఈ మధ్యకాలంలో స్లంప్‌ను ఎదుర్కొంటోన్నాడు. ఫామ్ కోల్పోయాడు. భారీ షాట్లు ఆడటం మరిచిపోయినట్టున్నాడు. చిన్నా, చితకా జట్ల మీద కూడా చేతులెత్తేస్తోన్నాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్- అతని వైఫల్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్.
బంగ్లాదేశ్‌తో రావల్పిండి స్టేడియంలో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లో సిరీస్‌లోనూ ఘోరంగా విఫలం అయ్యడు బాబర్ ఆజమ్. ఈ సిరీస్‌లో అతను చేసిన మొత్తం పరుగులు 64 మాత్రమే. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్‌లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్‌లో 22 పరుగులే చేశాడు.

రెండో టెస్ట్ మ్యాచ్‌లో కూడా తన స్థాయి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు బాబర్ ఆజమ్. తొలి ఇన్నింగ్‌లో 31, రెండో ఇన్నింగ్‌లో 11 పరుగులే చేశాడు. ఈ టెస్ట్‌ను కూడా గెలుచుకుంది బంగ్లాదేశ్. రెండు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. పాకిస్తాన్ సొంతగడ్డపై తనకంటే ఎంతో బలమైన జట్టును మట్టికరిపించింది.
అక్కడితో బాబర్ ఆజమ్ అధ్వాన్నపు ఆటతీరుకు బ్రేకులు పడలేదు. ఇంగ్లాండ్‌పైనా కొనసాగింది. తొలి టెస్ట్‌లో దారుణంగా ఆడాడు. తొలి ఇన్నింగ్‌లో 30, రెండో ఇన్నింగ్‌లో అయిదు పరుగులకే చాప చుట్టేశాడు. ఈ వైఫల్యాల పరంపరం అతని కేరీర్‌ను మొత్తానకీ దెబ్బకొట్టినట్టే కనిపిస్తోంది.
ఇంగ్లాండ్‌తో ఆరంభం కాబోయే రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆడబోయే జట్టు నుంచి ఆజమ్‌ను తప్పించాలని పాకిస్తాన్ సెలెక్టర్లు నిర్ణయించారు. అలీమ్ దార్, అకిబ్ జావెద్, అజర్ అలీ, అషద్ షఫిక్‌తో కూడిన ముగ్గురు సభ్యుల సెలెక్షన్ కమిటీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మోహసిన్ నక్వీకి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
అలాగే- మూడు సంవత్సరాల కాల పరిమితితో జట్టులో అయిదు మంది మెంటార్లను నియమించాలని కూడా సూచించినట్లు సమాచారం. ఈ విషయంపై సెలెక్టర్లు ఇప్పటికే టెస్ట్ ఫార్మట్ హెడ్ కోచ్ జేసన్ గిల్లెస్పీ, కేప్టెన్ షాన్ మసూద్‌తో చర్చించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 15వ తేదీన ఆరంభం కాబోతోంది. ముల్తాన్ స్టేడియం దీనికి వేదిక. తొలి టెస్ట్ ముగిసిన రెండో రోజే పాకిస్తాన్ జట్టు ముల్తాన్‌కు బయలుదేరి వెళ్లింది. అక్కడే నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటోంది. సెలెక్టర్లు కూడా శనివారమే ముల్తాన్‌కు బయలుదేరి వెళ్లారు. బాబర్ ఆజమ్‌ను జట్టు నుంచి తప్పించడంపై హెడ్ కోచ్, కేప్టెన్‌కు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు.
బాబర్ ఆజమ్ స్థానంలో నోమన్ అలీ, సాజిద్ ఖాన్‌లల్లో ఒకరిని జాతీయ జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. అబ్రార్ అహ్మద్ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ- గాయం నుంచి పూర్తిగా రికవరీ కాకపోవడం, ప్రస్తుతం అతను ఆసుపత్రిలోనే ఉండటం వల్ల ఎంపిక చేసే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications