బాబర్ ఆజమ్‌కు ఉద్వాసన: పాక్ కొత్త జట్టు ఇదే
Babar Azam: ఊహించినట్టే- పాకిస్తాన్ మాజీ కేప్టెన్ బాబర్ ఆజమ్ జట్టులో చోటు కోల్పోయాడు. ఈ మధ్యకాలంలో పేలవమైన ఫామ్‌లో ఉన్న అతనిపై వేటు వేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. అతనికి ఉద్వాసన పలికింది. ఇంగ్లాండ్‌తో చివరి రెండు టెస్ట్ మ్యాచ్‌లల్లో ఆడబోయే కొత్త జట్టును ప్రకటించింది.
మొత్తం 16 మంది ప్లేయర్లతో కూడిన జట్టు ఇది. షాన్ మసూద్ కేప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సవూద్ షకీల్ వైస్ కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. రెండు కొత్త ముఖాలకు చోటు లభించింది. నోమన్ అలీ, సాజిద్ ఖాన్‌లను జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు అలీమ్ దార్, అకిబ్ జావెద్, అజర్ అలీ, అషద్ షఫిక్‌తో కూడిన ముగ్గురు సభ్యుల సెలెక్షన్ కమిటీ కొత్త జట్టును అధికారికంగా ప్రకటించింది.

ఈ మధ్యకాలంలో ఘోరంగా విఫలమౌతోన్నాడు బాబర్ ఆజమ్. ఫామ్ కోల్పోయాడు. భారీ షాట్లు ఆడటాన్ని దాదాపుగా మరిచిపోయాడు. చిన్నా, చితకా జట్ల మీద సైతం ఏ మాత్రం రాణించలేక చేతులెత్తేస్తోన్నాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్- అతని వైఫల్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
బంగ్లాదేశ్‌తో రావల్పిండి స్టేడియంలో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లో సిరీస్‌లోనూ ఘోరంగా విఫలం అయ్యడు బాబర్ ఆజమ్. ఈ సిరీస్‌లో అతను చేసిన మొత్తం పరుగులు 64 మాత్రమే. అక్కడితో బాబర్ ఆజమ్ అధ్వాన్నపు ఆటతీరుకు బ్రేకులు పడలేదు. ఇంగ్లాండ్‌పైనా కొనసాగింది. తొలి టెస్ట్‌లో దారుణంగా ఆడాడు. తొలి ఇన్నింగ్‌లో 30, రెండో ఇన్నింగ్‌లో అయిదు పరుగులకే చాప చుట్టేశాడు.
ఈ వైఫల్యాల పరంపరం అతని కేరీర్‌ను మొత్తానకీ దెబ్బకొట్టింది. ఇంగ్లాండ్‌తో ఆరంభం కాబోయే రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆడబోయే జట్టు నుంచి ఆజమ్‌ను తప్పించాలని పాకిస్తాన్ సెలెక్టర్లు నిర్ణయించారు. ఈ విషయంపై సెలెక్టర్లు ముందుగానే టెస్ట్ ఫార్మట్ హెడ్ కోచ్ జేసన్ గిల్లెస్పీ, కేప్టెన్ షాన్ మసూద్‌తో సమాచారం ఇచ్చారు కూడా.
రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 15వ తేదీన ఆరంభం కాబోతోంది. ముల్తాన్ స్టేడియం దీనికి వేదిక. ఈ నెల 24వ తేదీన రావల్పిండిలో మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ రెండింట్లోనూ బాబర్ ఆజమ్‌కు చోటు దక్కలేదు. ఈ రెండు టెస్టులు ఆడే జట్టును కొద్దిసేపటి కిందటే ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్.
Pakistan name squad for 2nd and 3rd England Tests
— PCB Media (@TheRealPCBMedia) October 13, 2024
Details here ➡️ https://t.co/vWp6IJeDkj#PAKvENG | #TestAtHome
మొత్తం 16 మందితో కూడిన జట్టులో- షాన్ మసూద్ (కేప్టెన్), సవూద్ షకీల్ (వైస్ కేప్టెన్), అమీర్ అజ్మల్, అబ్దుల్లా షఫిక్, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, మెహ్రాన్ ముంతాజ్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నొమన్ అలీ, సయీమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ ఆఘా, జహీద్ మహమూద్‌లకు చోటు దక్కింది.












Click it and Unblock the Notifications