Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాధలో ఉన్న బావుమాపై దూసుకెళ్లిన పాక్ ప్లేయర్లు: మీరు మారరేంట్రా

Rachin Ravindra: ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ జట్టు వివాదాల్లో చిక్కుకుంది. ఆతిథ్య దేశం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఆ జట్టు ప్లేయర్లు ప్రవర్తించిన విధానంపై మండిపడుతున్నారు. ఆగ్రహావేశాలను తెలియజేస్తోన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు మూడు దేశాల సిరీస్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చింది పాకిస్తాన్. న్యూజిలాండ్- పాకిస్తాన్- దక్షిణాఫ్రికా ఇందులో తలపడుతున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా బుధవారం రాత్రి కరాచీ స్టేడియంలో జరిగిన పాకిస్తాన్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఈ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

PAK vs SA Pakistan fielders Saud Shakeel and Kamran Ghulam surrounded the Temba Bavuma

తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఓపెనర్ టెంబా బావుమా అద్భుతంగా రాణించాడు. 96 బంతుల్లో 13 ఫోర్లతో 82 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కె, హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు.

మాథ్యూ- 84 బంతుల్లో ఒక సిక్స్, 10 ఫోర్లతో 83, క్లాసెన్- 56 బంతుల్లో మూడు సిక్సర్లు, 11 ఫోర్లతో 87 పరుగులు చేశారు. లోయర్ ఆర్డర్‌లో కైలె వెరెన్నె 32 బంతుల్లో 44 పరుగులతో మెరుపు ఇన్నింగ్ ఆడటంతో దక్షిణాఫ్రికా 352 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. రెచ్చిపోయి ఆడింది. ఇంకా ఒక ఓవర్ మిగిలివుండగానే 355 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు కోల్పోయింది నాలుగు వికెట్లు మాత్రమే. కేప్టెన్ మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ ఆఘా సెంచరీలతో చెలరేగారు. రిజ్వాన్- 122, ఆఘా- 134 పరుగులు చేశారు.

కాగా- ఈ మ్యాచ్‌లో టెంబా బావుమా పట్ల పాకిస్తాన్ ప్లేయర్లు వ్యవహరించిన తీరు విమర్శలకు కేంద్రబిందువు అయింది. బావుమా రనౌట్ అయినప్పుడు- అతని మీదికి దూసుకెళ్లారు సవూద్ షకీల్, కమ్రాన్ గులాం. సవూద్ షకీల్, కమ్రాన్ గులాం అయితే మరీనూ. నేరుగా బావుమా ముందు నిల్చొని సెలబ్రేట్ చేసుకున్నారు.

ఆ సమయంలో సవూద్ షకీల్ అగ్రెసివ్‌గా బావుమా పైకి దూసుకెళ్లడం కనిపించింది. అప్పుడే అక్కడికి వచ్చిన సల్మాన్ ఆఘా అతన్ని వెనక్కి లాగాడు. అవుట్ అయిన బాధలో ఉన్న బావుమాపైకి అలా దూసుకెళ్లడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సమయంలో బావుమా తలదించుకున్నాడు. పెవిలియన్ దారి పట్టాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+