క్రికెట్ మక్కా లార్డ్స్ లో చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ బౌలర్.. !!
క్రికెట్ మక్కాగా ప్రసిద్ధి చెందిన లండన్ లార్డ్స్ లో మ్యాచ్ ఆడటమే ఒక ఎత్తు అనుకుంటే.. అదే పిచ్ పై అంతకంటే అద్భుతంగా రాణించడం మరో ఎత్తు. ఇక్కడ సత్తా చాటాలనేది ఒక్క క్రికెటర్‌కు కూడా ఓ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ గా నిలుస్తుంది. అలాంటి అరుదైన రికార్డును నెలకొల్పాడు.. పాకిస్తాన్ పేస్ బౌలర్ మహ్మద్ అబ్బాస్. లార్డ్స్ లో చరిత్ర సృష్టించాడు. ఓ అరుదైన ఘనతను తన పేరు మీద లిఖించుకున్నాడు.
ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో అబ్బాస్ రెండో ఇన్నింగ్ లో అయిదు వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ ఆనర్స్ బోర్డులో అతని పేరు ఎక్కబోతోంది. అయిదు వికెట్లు తీసుకున్న ప్రతి బౌలర్ గౌరవార్థం ఇక్కడి ఆనర్స్ బోర్డులో పేర్లు రాయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఛాన్స్ ఇప్పుడు మహ్మద్ అబ్బాస్ కు దక్కింది. ఈ రెండో టెస్ట్ లో రెండు ఇన్నింగ్ లల్లో కలిపి తొమ్మిది వికెట్లు నేలకూల్చాడు.

మహ్మద్ అబ్బాస్ తన టెస్ట్ కెరీర్‌లో అయిదు వికెట్లు పడగొట్టడం ఇది ఎనిమిదోసారి. అయిదో వికెట్ పడ్డ తర్వాత అతను ఉద్వేగానికి గురయ్యాడు. కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ, వికెట్లు పడగొట్టిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. స్వింగ్ బౌలింగ్‌లో తనకున్న అపారమైన నైపుణ్యాన్ని ఉపయోగించి ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. అతని దెబ్బకు రెండో ఇన్నింగ్ లో 208 పరుగులకే ఆలౌట్ అయింది ఇంగ్లాండ్. 384 పరుగుల విజయ లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందుంచింది.
రెండో ఇన్నింగ్ లో ఓపెనర్ ఎమిలియో గే- 31, హ్యారీ బ్రూక్- 24, డాన్ లారెన్స్- 54, వికెట్ కీపర్ జేమీ స్మిత్- 7, ఒల్లీ రాబిన్సన్- 8 వికెట్లను తీసుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ జోరుకు కళ్లెం వేశాడు. లార్డ్స్ ఆనర్స్ బోర్డుపై చోటు దక్కించుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఇక్కడ జరిగే టెస్ట్ మ్యాచ్‌లలో ఒక ఇన్నింగ్స్‌లో అయిదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లకు మాత్రమే ఈ అరుదైన అవకాశం లభిస్తుంది. అలాగే సెంచరీలు చేసిన బ్యాటర్ల పేర్లను కూడా ఈ బోర్డుపై నమోదు చేస్తారు. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి దిగ్గజాల సరసన ఇప్పుడు అబ్బాస్ పేరు కూడా స్థానం సంపాదించుకోవడం విశేషం.













Click it and Unblock the Notifications