World Cup 2023: పాకిస్థాన్ ప్యాకప్ - సెమీస్ రేసులో నిలవాలంటే..!!

ప్రపంచ కప్ లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ ఫ్యాన్స్ కు మజా అందించింది. గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్థానం బోర్లా పడింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఒక్క వికెట్ తేడాతో పాక్ ను ఓడించి పాయింట్ల పట్టిక లో టాప్ లోకి చేరింది. ఈ ఓటమితో పాకిస్థాన్ సెమీ ఫైనల్ రేసు నుంచి దాదాపు వైదొలిగింది. అయితే, ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. మారుతున్న పాయింట్లు..రన్ రేట్లు కీలకం అవుతున్నాయి. పాకిస్థాన్ సెమీస్ రేసు లో నిలవాలంటే మారాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి.

మారుతున్న లెక్కలు: ప్రపంచ కప్ సమరంలో లెక్కలు మారుతున్నాయి. సౌతాఫ్రికా పాయంట్స్ పట్టికలో టాప్ లో నిలిచింది. భారత్ ను అధిగమించింది. దాదాపుగా సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. ఇప్పటికే ఢిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాడ్ కు సెమీస్ ద్వారాలు మూసుకుపోయాయి. ఇప్పుడు సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాకిస్థాన్ కు దాదాపు అదే పరిస్థితి ఏర్పడింది.

Pakistan have a chance to make it to the semi-finals of World Cup 2023, but will depend on the results of other teams

కానీ, సంచలనాలకు మారు పేరుగా నిలిచే వన్డే క్రికెట్ లో అనేక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. పాకిస్థాన్ సౌతాఫ్రికా పై గెలిచి ఉంటే సెమీస్ ఆశలు కూడా సజీవంగా ఉండేవి. కానీ ఈ మ్యాచ్ ఓడిపోవడంతో సెమీస్ చేరే అవకాశాలు కూడా గల్లంతయ్యాయి. పాకిస్థాన్ ఖాతాలో కేవలం నాలుగు పాయింట్లే ఉన్నాయి. తదుపరి మూడు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌తో పాక్‌ తలపడాల్సి ఉంది.

పాకిస్థాన్ అవుట్..నిలవాలంటే: చావో..రేవో లాంటి మ్యాచ్‌లోనూ పాకిస్థాన్‌ తెగువ చూపలేకపోయింది. సౌతాఫ్రికాపై ఓటమితో టోర్నమెంట్‌లో బాబర్‌ సేననాకౌట్‌ దారులు దాదాపు మూసుకుపోయాయి. ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు రెండింటిలోనే విజయం సాధించింది. అంటే ఆ జట్టు ఖాతాలో కేవలం నాలుగు పాయింట్లే ఉన్నాయి. తదుపరి మూడు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌తో పాక్‌ తలపడాల్సి ఉంది.

Pakistan have a chance to make it to the semi-finals of World Cup 2023, but will depend on the results of other teams

ఇక పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొలి మూడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, భారత్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌ దిశగా ముందంజలో ఉన్నాయి. ఆస్ట్రేలియా (6) నాలుగో స్థానంలో నిలిచింది. కాగా..చివరి మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా పాకిస్థాన్‌కు గరిష్ఠంగా 10 పాయింట్లే ఉంటాయి. చివరి మూడు మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తామని.. ఈ మూడు మ్యాచ్‌ల తర్వాత పాయింట్స్ టేబుల్‌లో ఎక్కడ ఉంటామో చూద్దామంటూ బాబర్ ఆజామ్ తమ పరిస్థితిని చెప్పకనే చెప్పాడు.

భారత్ ను దాటేసిన సఫారీలు: ప్రస్తుత పాయింట్లు..రన్ రేటు ఆధారంగా మ్యాచ్ మ్యాచ్ కు లెక్కలు మారుతున్నాయి. టాప్ లో ఉన్న నాలుగు జట్లు సెమీస్ చేరుతాయి. ఈ పరిస్థితుల్లో.. తదుపరి నాలుగు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా కనీసం రెండు పోటీల్లో ఓడాల్సి ఉంటుంది. అది జరిగితే కంగారూలు కూడా 10 పాయింట్లతో ఉంటారు. అప్పుడు పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా జట్ల అదృష్టం నెట్‌ రన్‌రేట్‌పై ఆధారపడి ఉంటుంది.

South Africa Team World Cup

ఒకవేళ ఆస్ట్రేలియా చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓటమి పాలైతే..పాకిస్థాన్‌కు నాలుగో స్థానం లభిస్తుంది. కానీ అది సాధ్యమయ్యే అవకాశాలు ఎంతమాత్రమూ లేవు. తదుపరి మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడితే కనుక పాకిస్థాన్‌ జట్టు ఇంటిముఖం పట్టక తప్పదు. ఇక, భారత్ ఇప్పటి వరకు టాప్ లో నిలిచినా.. మిగిలిన మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్..సౌతాఫ్రికాతో ఫలితాలు భారత్ స్థానంపై ప్రభావం చూపనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+