ఆజమ్ కథ ఇలా ముగుస్తుందనుకోలేదు భయ్యా
Asia Cup 2025: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025కు కౌంట్ డౌన్ మొదలైంది. నెల రోజులు కూడా లేదు. సెప్టెంబర్ 9వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. దీనికి వేదిక. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది.
ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటికే మ్యాచ్ ల తేదీలు, గ్రూపులు, వెన్యూలు ఖరారయ్యాయి కూడా.

ఈ టోర్నమెంట్ లో ఆడబోయే పాకిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇందులో కొన్ని అనూహ్య మార్పులు కనిపించాయి. డాషింగ్ ఓపెనర్ బాబర్ ఆజమ్, మాజీ కేప్టెన్ కమ్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కు చోటు దక్కలేదు. ఈ ఇద్దరినీ పక్కనపెట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్.
డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనలో చివరిసారిగా టీ20 ఇంటర్నేషనల్స్ ఆడారు బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్. ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం దక్కలేదు వారికి. మొన్నటి వెస్టిండీస్ సిరీస్ లోనూ వీరిద్దరు విఫలమైన నేపథ్యంలో వేటు పడింది. సల్మాన్ అలీ ఆఘా జట్టుకు నాయకత్వం వహిస్తోన్నాడు. షహీన్ షా అఫ్రిది తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఆసియా కప్ ఆరంభం కావడానికి ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బంగ్లాదేశ్ తో పాకిస్తాన్.. ముక్కోణపు సిరీస్‌ల ఆడుతుంది. ఈ రెండింటి కోసం పీసీబీ 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ ఈ నెల 29వ తేదీన షార్జా క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది.
పాకిస్తాన్ జట్టు వివరాలు: సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్‌దిల్ షా, మహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ షా అఫ్రిది, సుఫియాన్ మోఖీం.












Click it and Unblock the Notifications