భారత్- బంగ్లాదేశ్ గొడవ మధ్యలో తలపెట్టిన పాకిస్తాన్..!!

టీ20 వరల్డ్ కప్ మ్యాచులను ఆడటానికి భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించింది. పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ నుండి బహిష్కరించిన తర్వాత ఆటగాళ్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ధృవీకరించింది. వరల్డ్ కప్ మ్యాచులు ఆడటానికి భారత్ వెళ్లకూడదని నిర్ణయించినట్లు తెలిపింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ నుండి ముస్తాఫిజుర్‌ రెహ్మాన్ విడుదల చేయడం దీనికి ప్రధాన కారణం.

భద్రతా కారణాలను చూపుతూ.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాము ఆడబోయే మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని అధికారికంగా అభ్యర్థించింది. ఈ మేరకు ఐసీసీకి ఈ- మెయిల్ పంపించింది. భద్రతపరమైన ఆందోళనల కారణంగా టీ20 వరల్డ్ కప్ కోసం తమ జట్టును భారత్ కు పంపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. భారత గడ్డపై తమ మ్యాచ్‌లను ఆడకూడదని 17 మంది బీసీబీ డైరెక్టర్లు తీర్మానించారని, దీనికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.

Pakistan Reportedly Ready to Welcome Bangladesh for T20 World Cup Fixtures

టీ20 ప్రపంచ కప్ లో తాము ఆడబోయే మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనను ఐసీసీ స్పష్టంగా తిరస్కరించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రతిపాదనను అంగీకరించలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. టీ20 ప్రపంచ కప్‌లో ఆడాలంటే భారత్‌కు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. లేదంటే పాయింట్లు కోల్పోయే ప్రమాదం ఉందనీ హెచ్చరించింది. మంగళవారం బీసీబీ, ఐసీసీ మధ్య జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తెలియజేసింది.

తాజాగా ఈ గొడవ మధ్యలో తలపెట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. బంగ్లాదేశ్ ఆడబోయే మ్యాచ్ లను తాము నిర్వహిస్తామని తెలిపింది. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను తమ దేశంలో నిర్వహించడానికి ఆసక్తిగా ఉన్నామని పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ విమెన్స్ క్వాలిఫైయర్ వంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ లన్నీ కూడా విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసింది. టీ20 వరల్డ్ కప్‌ లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను కూడా అదే విధంగా సక్సెస్ చేయగలమని పేర్కొంది. దీనికి సంబంధించి తమ వద్ద అన్ని స్టేడియాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.

నిజానికి- టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ లో బంగ్లాదేశ్ నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 7 కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో తన తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ తో తలపడాల్సి ఉంది. 9న ఇటలీ, ఆ తర్వాత ఇంగ్లాండ్‌ను ఢీకొట్టాల్సి ఉంది. వీటికి కూడా ఈడెన్ గార్డెన్సే వేదిక. అనంతరం ముంబై వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో మ్యాచ్ ఆడాలి. ముస్తాఫిజుర్ ను కేకేఆర్ తొలగించడంతో భద్రత పరమైన కారణాలను తెరమీదికి తెచ్చింది బంగ్లాదేశ్. ఈ మ్యాచ్ లను శ్రీలంకకు షిఫ్ట్ చేయాలని ఐసీసీని కోరింది. దీన్ని తాజాగా ఐసీసీ తిరస్కరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+