అడ్డంగా బుక్కయిన పాక్ ప్లేయర్: ఐసీసీ 3 నెలల నిషేధం!
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ పాకిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నవాజ్‌పై ఐసీసీ 3 నెలల నిషేధం విధించింది. శ్రీలంకలోని కొలంబోలో నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో మహమ్మద్ నవాజ్ దోషిగా తేలడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం నిషేధిత పదార్థాలను వాడటం నేరంగా పరిగణించబడుతుంది.
వరల్జ్ కప్ మ్యాచ్ అనంతరం బయటపడిన వ్యవహారం
ఈ వివాదం కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌తో ముడిపడి ఉంది. ఫిబ్రవరి 7న పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ ముగిసిన వెంటనే.. ఐసీసీ వైద్య బృందం ప్లేయర్లకు సాధారణ డోపింగ్ పరీక్షలను నిర్వహించింది. ఈ టెస్టుల్లో మహమ్మద్ నవాజ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపగా.. నవాజ్ నిషేధిత పదార్థమైన కార్బాక్సీ-టీహెచ్సీ సేవించినట్లు స్పష్టంగా తెలిసింది. ఈ క్రమంలో ఐసీసీ మహమ్మద్ నవాజ్‌కు నోటీసులు జారీ చేసింది.

తప్పు అంగీకరించిన మహమ్మద్ నవాజ్
తాను చేసిన తప్పును మహమ్మద్ నవాజ్ ఐసీసీ విచారణలో వెంటనే అంగీకరించాడు. తాను తన ఆటతీరును మెరుగుపరుచుకునేందుకు ఈ పదార్థాన్ని వాడలేదని మహమ్మద్ నవాజ్ స్పష్టం చేశాడు. మ్యాచ్‌లు లేని సమయంలోనే దానిని తీసుకున్నట్లు మహమ్మద్ నవాజ్ తగిన ఆధారాలతో నిరూపించుకున్నాడు. మహమ్మద్ నవాజ్ వివరణతో సంతృప్తి చెందిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.. ఉద్దేశపూర్వకంగా ఆట కోసం డోపింగ్ కు పాల్పడలేదని కోణంలో నవాజ్‌పై విధించే శిక్షా కాలాన్ని 3 నెలలకు పరిమితం చేసింది. మహమ్మద్ నవాజ్ తాత్కాలిక సస్పెన్షన్ ను అంగీకరిస్తూ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో ఈ నిషేధం మే 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది.
శిక్ష తగ్గింపునకు లభించిన అవకాశం
ప్రస్తుతం రెండున్నర నెలల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న పాక్ క్రికెటర్ మహమ్మద్ నవాజ్‌కు ఐసీసీ ఓ వెసులుబాటును కూడా కల్పించింది. ఐసీసీ సూచించిన పునరావాస కార్యక్రమంలో పాల్గొనేందుకు నవాజ్ అంగీకరించాడు. ఒకవేళ నవాజ్ ఈ చికిత్సా కార్యక్రమాన్ని ఐసీసీ రూల్స్ ప్రకారం విజయవంతంగా పూర్తి చేయగలిగితే.. నవాజ్‌పై ఉన్న 3 నెలల నిషేధాన్ని కేవలం ఒక నెలకు తగ్గించే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠినమైన నిబంధనల ప్రకారం, ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ నుంచి మే 1, 2026 వరకు మహమ్మద్ నవాజ్ ఆడిన అన్ని మ్యాచ్‌ల రికార్డులను కూడా అనర్హమైనవిగా ప్రకటించారు.














Click it and Unblock the Notifications