T20 World Cup 2024: పాక్ జట్టుపై తాజా, మాజీల ఆగ్రహం..

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ను పరాజయాలు వెంటాడతున్నాయి. పాక్ చిన్న జట్ల చేతిలో ఓడిపోవడంతో ఆ దేశ మాజీ ఆటగాళ్లు జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు. పసికూన అమెరికా చేతిలో పాక్ ఓడిపోవడంపై మండి పడుతున్నారు. ఆప్ఘానిస్థాన్ చేతిలో కూడా పాక్ చావు దెబ్బ తిన్నది. ఇండియాతో జరిగిన మ్యాచ్ లో పాక్ గెలుపునకు దగ్గరగా వచ్చి బోల్తా పడింది. దీంతో ఆ జట్టు సూపర్ 8 దశకు అర్హత సాధిస్తుందా లేదా అని తెలియని పరిస్థితి నెలకొంది. పాక్ తర్వాతి రెండు మ్యాచ్ ల్లో గెలిస్తేనే సూపర్ 8కు వెళ్తోంది.

పాక్ జట్టు ఆటతీరుపై ఆ జట్టు మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అభిమానుల నుంచి మాజీ ఆటగాళ్లు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు.పాక్ ఓటములకు ఇమాద్ వసీం, మహమ్మద్ అమీర్ కారణమని మహమ్మద్ హఫీజ్ అన్నాడు. పాక్ క్రికెట్ బోర్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు ఆటగాళ్లను వరల్డ్ కప్ కు ఎంపిక చేసి నాశనం చేసిందన్నారు. దేశ ప్రతిష్ట దిగజార్చిన అమీర్, ఇమాద్ వసీంను వరల్డ్ కప్ కు ఎంపిక చేసి పెద్ద తప్పు చేసిందన్నారు.

Pakistan s failures in the T20 World Cup are receiving severe criticism

పాక్ క్రికెట్ బోర్డ్ ఆరు నెలల క్రితం వారిని పాకిస్థాన్‌కు ఆడమని అడిగితే వారు లీగ్‌లకే ప్రాధాన్యమిచ్చారన్నారు. వరల్డ్ కప్ లో అమీర్ అమెరికాపై సూపర్ ఓవర్ లో 18 పరుగులు ఇచ్చాడు. ఇమాద్ వసీం భారత్ పై జరిగిన మ్యాచ్ లో 23 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేయడంతో అతనిపై విమర్శలు వస్తున్నాయి.

31 ఏళ్ల అమీర్ పీసీబీతో చర్చలు జరిపిన తర్వాత తన అంతర్జాతీయ రిటైర్మెంట్‌పై యు-టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఆమీర్ నిషేధం ఎదుర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+