వైభవంగా పారిస్ ఒలింపిక్స్: భారీ వర్షంలో తళుక్కుమన్న పీవీ సింధు, ఆచంట
Paris Olympics 2024: బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్.. ఒలింపిక్స్ 2024 అంగరంగ వైభవంగా ఆరంభం అయ్యాయి. 16 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆగస్టు 11వ తేదీన ముగుస్తాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడోత్సవాలు చివరిసారిగా 2020లో ముగిశాయి. టోక్యో దీనికి ఆతిథ్యాన్ని ఇచ్చింది అప్పట్లో.
వందేళ్ల తరువాత..
ఇప్పుడు పారిస్ దీనికి వేదిక అయింది. ఒలింపిక్స్‌కు ఫ్రాన్స్ ఆతిథ్యాన్ని ఇవ్వటం వందేళ్ల తరువాత ఇదే తొలిసారి. ఓపెనింగ్ సెలెబ్రేషన్స్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు నుంచే పారిస్ వర్షం కురిసింది. మధ్యాహ్నం తుంపర్లతో ఆరంభమైన వాన.. గేమ్స్ ఆరంభం అయ్యే సమయానికి జడివానగా మారింది. భారీ వర్షంలోనే పారిస్ సీన్ నదిలో ఓపెనింగ్ సెరెమని ర్యాలీ కొనసాగింది.

ఫ్లాగ్ బేరర్లుగా..
ఈ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ఐకన్ శరత్ కమల్ ఆచంట ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు వారిద్దరూ. మొత్తంగా భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
లేడీ గాగా..
అమెరికన్ పాప్ సింగర్ లేడీ గాగా, ఫ్రెంచ్-మిలానియన్ సింగర్ కమ్ సాంగ్ రైటర్ అయా నకుమురా, ఫ్రెంచ్ యాక్సెల్లె సెయింట్ సిరెల్.. తమ పెర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. యాక్సెల్లె సెయింట్ సిరెల్.. ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించారు.

విషెస్ తెలిపిన ప్రధాని..
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరిన్ని పతకాలను తీసుకుని రావాలని ఆకాంక్షించారు. ప్రతి క్రీడాకారుడు దేశానికి గర్వకారణం కావాలని పేర్కొన్నారు. దేశ ప్రజల్లో స్ఫూర్తినింపేలా అత్యుత్తమ విజయాలను సాధించాలని కోరారు.
మధ్యాహ్నం తొలి ఈవెంట్..
పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు తొలి స్పోర్ట్స్ ఈవెంట్ ఆరంభం కానుంది. ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బీచ్ వాలీబాల్, బాక్సింగ్, సైక్లింగ్ బోర్డ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, సాకర్, హ్యాండ్‌బాల్, హాకీ, జుడో, షూటింగ్, స్కేట్‌బోర్డింగ్, టేబుల్ టెన్నిస్ వంటి ఈవెంట్లు తొలి రోజున షెడ్యూల్ అయ్యాయి.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications