IPL 2024: సన్‌రైజర్స్ కు కొత్త కెప్టెన్ గా కమిన్స్ - దశ మారేనా..!!
ఐపీఎల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. 17వ ఐపీఎల్ సీజన్ కు జట్టుకు వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను ఛాంపియన్‌గా నిలిపిన పాట్ కమిన్స్ సారధ్యం వహించేందుకు రంగం సిద్దమైంది. ఐపీఎల్ వేలంలో కమిన్స్‌ను హైదరాబాద్ రూ. 20.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కెప్టెన్ గా ఉన్న ఐడెన్ మార్క్రామ్ స్థానంలో కమిన్స్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సారి ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త అంచనాలతో బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ 2023లో ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలవగలిగింది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

దీంతో, జట్టు సారధ్య బాధ్యతల మార్పు పైన కసరత్తు చేస్తున్నారు. మార్క్రామ్ కెప్టెన్సీలో హైదరాబాద్ ఫ్రాంచైజీ జట్టు ఈస్టర్న్ క్యాప్ SA20 లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో, మార్క్రామ్‌ను జట్టుకు కెప్టెన్‌గా ఉంచాలా లేక కమిన్స్ కు అప్పగించేలా అనే అంశం పైన చర్చలు జరుగుతున్నాయి.
డేవిడ్ వార్నర్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు సారధ్య బాధ్యతలు మార్చటం ద్వారా తిరిగి పూర్వ వైభవం సాధించాలని ప్రయత్నిస్తోంది. ఐపీఎల్ లో ఈ నెల 22 నుంచి లీగ్‌కు తెరలేవనుంది. మినీ వేలంలో ఫ్రాంచైజీ కమిన్స్‌ను భారీ ధర రూ.20.50 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
గతేడాది కమిన్స్ ఆసిస్ జట్టుకు రెండు ఐసీసీ టైటిల్స్ అందించాడు. ఈ నేపథ్యంలోనే ఫ్రాంచైజీ మార్క్‌రమ్‌ను తప్పించి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్‌ని మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది.












Click it and Unblock the Notifications