సన్‌రైజర్స్ చేతులు కాల్చుకుంటోందా: హై-వెలాసిటీ టైమ్ లో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తన సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. సమవుజ్జీల మధ్య సాగే ఈ మ్యాచ్ కు పింక్ సిటీ జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదిక కానుంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగంలో స్పిన్‌కు ప్రాధాన్యత ఇస్తోంటే.. సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ హై-వెలాసిటీతో దూకుడుగా ఉంటుంది.
ఇతర పిచ్‌ల కంటే జైపూర్ భిన్నం. బౌండరీ లైన్ పెద్దది. స్లోయర్ సర్ఫేస్ ను కలిగి ఉంటుంది. అందుకే ఈ పిచ్ పై బౌలర్లు రాణిస్తుంటారు ఎక్కువగా. అలాగే బ్యాటర్లు పవర్ హిట్టింగ్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది రాజస్థాన్ రాయల్స్. ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ, ఆడిన ఏడు మ్యాచ్‌లలో అయిదు విజయాలను అందుకుంది. లో స్కోర్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించి జోరు మీదుంది.

మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉన్న ఈ జట్టు మరో విజయం సాధిస్తే టాప్ 4లో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటుంది. ఏడు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు, మూడు ఓటములతో ఎస్ఆర్హెచ్ మంచి స్థితిలో ఉంది. ఇప్పటివరకు హైదరాబాద్, రాజస్థాన్ జట్లు 22 సార్లు తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్- 9, సన్ రైజర్స్ 13 మ్యాచ్‌లలో విజయం సాధించాయి.
ఈ మ్యాచ్ కోసం కేప్టెన్సీ చేతులు మారబోతోంది. మొదటి ఏడు మ్యాచ్‌లకు ఇషాన్ కిషన్ నాయకత్వం వహించగా, ఇప్పుడు పాట్ కమిన్స్ కెప్టెన్‌గా తిరిగి జట్టులోకి వచ్చాడు. అతను కెప్టెన్‌గా, ఫాస్ట్ బౌలర్‌గా జట్టుకు అదనపు బలంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీలంక ఆటగాడు దిల్షాన్ మదుశంక స్థానంలో కమిన్స్ ఆడనున్నాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ కేప్టెన్సీలో వరుస విజయాలు సాధిస్తోన్న సన్ రైజర్స్.. ఈ మార్పుతో రిథమ్ కోల్పోవచ్చనే అంచనాలు ఉన్నాయి.
రాజస్తాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 ప్రాబబుల్స్ లో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మైర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ ఆడే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్: సందీప్ శర్మ బరిలో దిగొచ్చు.
సన్ రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్ష్ దూబే/ప్రఫుల్ హింగే, శివాంగ్ కుమార్, ఈషాన్ మలింగా ఆడొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ గా సాకిబ్ హుస్సేన్ కు చోటు దక్కొచ్చు.












Click it and Unblock the Notifications