IPL 2026: గెలిపించిన కమిన్స్, ఇషాన్.. ప్లే ఆఫ్స్‌కు SRH!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. సోమవారం చెన్నై వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)ని ఓడించింది.

ఈ విజయంతో ఆరెంజ్ ఆర్మీ 8వ సారి ప్లే ఆఫ్స్‌ చేరగా.. గుజరాత్ టైటాన్స్ బెర్త్ కూడా ఖరారైంది. చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

గెలిపించిన ఇషాన్ కిషన్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల‌కు 180 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44), కార్తీక్ శర్మ(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. సాకిబ్ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగలకు చెరో వికెట్ దక్కింది.

Pat Cummins Three-Wicket Haul and Ishan Kishan s Sizzling 70 Power SRH to Playoff Berth with Win Over CSK

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసి గెలుపొందింది. ఇషాన్ కిషన్(47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. హెన్రీచ్ క్లాసెన్ (26 బంతుల్లో 6 ఫోర్లతో 47) సత్తా చాటాడు. సీఎస్‌కే బౌలర్లలో ముఖేష్ చౌదరి రెండు వికెట్లు తీయగా.. అకీల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ తీసారు.

క్లాసెన్ ఖతర్నాక్ షో..

181 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ ట్రావిస్ హెడ్(6), అభిషేక్ శర్మ(26) తీవ్రంగా నిరాశపర్చారు. ఈ పరిస్థితుల్లో హెన్రీచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ జట్టును ఆదుకున్నారు. దూకుడుగా ఆడి వేగంగా పరుగులు రాబట్టారు. హాఫ్ సెంచరీ ముంగిట క్లాసెన్ ఔటైనా.. ఇషాన్ కిషన్ తన జోరును కొనసాగించాడు. 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్.. సలీల్ అరోరాతో కలిసి దూకుడుగా ఆడాడు. విజయం ముంగిట అతను ఔటైనా.. సలీల్ అరోరా, రవిచంద్రన్ స్మరణ్ విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.

గెలిపించిన కెప్టెన్, వైస్ కెప్టెన్

బౌలింగ్‌లో కెప్టెన్ పాట్ కమిన్స్(3/28) మూడు వికెట్లతో సీఎస్‌కే పతనాన్ని శాసించగా.. బ్యాటింగ్‌లో వైస్ కెప్టెన్ ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కీలకమైన మిడిల్ ఓవర్లలో హెన్రీచ్ క్లాసెన్‌తో కలిసి 75 పరుగులు జోడించిన ఇషాన్.. ఆఖరి వరకు క్రీజులో నిలబడి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+