PBKS ఓటమితో ప్లే ఆఫ్స్ రేసులో బిగ్ ట్విస్ట్ - ఇక, ఈ టీంలకే ఛాన్స్..!!
PBKS IPL 2026: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు ఊహించని టర్న్ తీసుకుంటోంది. తిరుగు లేదని భావించిన మేటి జట్లు ఇప్పుడు ప్లే ఆఫ్స్ కోసం కష్టపడాల్సి వస్తోంది. లీగ్ ముగింపు దశలో చోటు చేసుకుంటున్న ఫలితాలు మొత్తం ప్లే ఆఫ్స్ అవకాశాలను ఖాయం అనుకున్న జట్లకు టెన్షన్ గా మారాయి. తాజాగా ముంబాయి చేతిలో పంజాబ్ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఇప్పుడు కష్టంగా మారుతోంది. అటు టాప్ లో ఉన్నా.. ఆర్సీబీ పరిస్థితి అంతే. దీంతో.. ప్లే ఆఫ్స్ కు చేరే జట్ల సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతోంది. ముంబాయి చేతిలో పంజాబ్ ఓటమితో లెక్కలు మారిపోతున్నాయి. దీంతో, వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా (ఒక మ్యాచ్ రద్దు) దూసుకెళ్లి న పంజాబ్ కింగ్స్ పరిస్థితి దయనీయంగా మారింది. అందరికంటే ముందు ప్లే ఆఫ్స్ కు వెళ్తుంద నుకున్న జట్టుకు ఇప్పుడు ఆ అవకాశమే ప్రమాదంలో పడింది. శ్రేయాస్ సేనకిది వరుసగా ఐదో ఓటమి. దీంతో 13 పాయింట్లతో ఉన్న ఈ జట్టు చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా.. చెన్నై, రాజ స్థాన్‌లతో గట్టి పోటీ ఎదురు కానుంది. దీంతో.. సాంకేతికంగా పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నా... ఇతర జట్ల పాయింట్స్.. రన్ రేటు పంజాబ్ ప్లే ఆఫ్స్ ను డిసైడ్ చేయనుంది. మిగిలిన మ్యాచుల్లో గెలవటంతో పాటుగా.. రన్ రేటు పంజాబ్ కు కీలకం కానుంది. అదే విధంగా ఆర్టీసీ పాయంట్స టేబుల్ లో టాప్ లో ఉంది. అయినా.. ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ లో నిలుస్తుందని చెప్పలేని పరిస్థితి కొనసాగుతోంది.

ప్లే ఆఫ్స్ రేసు లో చివరికి నిలిచే జట్లు
ఆర్సీబీకి లీగ్ స్టేజ్‌లో ఇంకా రెండు కీలకమైన మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లతో ఆర్సీబీ ఆడనుంది. ఈ రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా ఆర్సీబీ 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. అయితే ఒకవేళ దురదృష్టవశాత్తూ బెంగళూరు ఈ రెండు మ్యాచ్ ల్లో ఓడిపోతే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. 16 పాయింట్ల వద్దే ఆగిపోతే, కింద ఉన్న జట్లు పుంజుకుని ఆర్సీబీని వెనక్కి నెట్టేసే ఛాన్స్ ఉంది. అందుకే ప్రస్తుతం టేబుల్ టాప్‌లో ఉన్నా, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఇంకా సేఫ్ కాదు అనే చెప్పాలి. పంజాబ్, సన్ రైజర్స్ కూడా నెక్స్ట్ మ్యాచులు కీలకం. ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాల్లో గుజరాత్ టైటాన్స్ అందరి కంటే ముందుంది. సన్ రైజర్స్‌కు 64.7 శాతం, పంజాబ్ కింగ్స్‌కు 62.8 శాతం ఛాన్సులు ఉన్నాయి. దీంతో.. ప్లే ఆఫ్స్ స్థానం కోసం చివరి వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications