మార్కో అబ్జల్యూట్ సినిమా- ఊచకోత
Punjab Kings vs KKR: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్.. చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. 111 పరుగులను కాపాడుకోగలిగింది. ప్రత్యర్థి జట్టును అంతకంటే తక్కువ స్కోర్‌కే పరిమితం చేయగలిగింది. ఏమాత్రం ఊహించని గెలుపు రుచి చూసింది. ఈ విజయంతో పాయిట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.
ముల్లాన్‌పూర్ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగింది లోకల్ టీమ్ పంజాబ్. నిర్ణీత 20 ఓవర్లల్లో 111 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు అందించిన 39 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని భారీ స్కోర్‌గా మలచడంలో ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు విఫలం అయ్యారు.

ప్రియాన్ష్ ఆర్య- 22, ప్రభ్‌సిమ్రన్ సింగ్- 30 పరుగులే ఇన్నింగ్ మొత్తానికీ టాప్. లోయర్ ఆర్డర్‌లో శశాంక్ సింగ్ 18 పరుగులు చేయడంతో పంజాబ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. జట్టు స్కోర్ వంద దాటగలిగింది. మిడిలార్డర్‌లో నెహాల్ వధేరా 10, లోయర్ ఆర్డర్‌లో జేవియర్ బెర్లెట్- 11 పరుగులు చేశారు. మిగిలిన వాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు.
ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత నైట్‌రైడర్స్ ఇంతకంటే ఘోరంగా ఆడింది. 95 పరుగులకే చాపచుట్టేసింది. 16 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. క్వింటన్ డికాక్- 2, సునీల్ నరైన్- 5, అజింక్య రహానె- 17, అంగ్‌క్రిష్ రఘువంశీ- 37, వెంకటేష్ అయ్యర్- 7, రింకూసింగ్- 2, ఆండ్రీ రస్సెల్- 17, రమణ్‌దీప్ సింగ్- 0, హర్షిత్ రాణా- 3, వైభవ్ అరోరా- 0 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్- బౌలర్ల సత్తాకు అద్దం పట్టింది. రెండు ఇన్నింగ్‌లల్లోనూ బౌలర్లు నిప్పులు చెరిగారు. పేస్, స్పిన్ బౌలింగ్‌తో మాయాజాలం సృష్టించారు. కోల్‌కత నైట్‌రైడర్స్ ఇన్నింగ్‌లో హర్షిత్ రాణా-3, వరుణ్ చక్రవర్తి- 2, సునీల్ నరైన్- 2, వైభవ్ అరోరా- 1, ఎన్రిచ్ నోర్ట్జె- 1 వికెట్ పడగొట్టగా.. పంజాబ్ ఇన్నింగ్‌లో యుజ్వేంద్ర చాహల్- 4, మార్కొ జన్‌సెన్- 3 వికెట్ల జట్టు విజయానికి బాటలు వేశారు.

ఈ మ్యాచ్‌లో మార్కొ జన్‌సెన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3.1 ఓవర్లల్లో 17 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు నేల కూల్చాడు. 5.36 ఎకానమీని రికార్డ్ చేశాడు. అతను పడగొట్టిన మూడు వికెట్లు కూడా క్లీన్ బౌల్డ్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తొలి ఓవర్ చివరి బంతికి సునీల్ నరైన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు మార్కొ జన్‌సెన్. ఓవర్ ది వికెట్ లెంగ్తీ డెలివరీని షాట్ ఆడటంలో విఫలం అయ్యాడు సునీల్ నరైన్. ఫ్రంట్ ఫుట్‌లో స్వైప్ చేయడానికి ప్రయత్నించాడు. బ్యాట్ అండ్ ప్యాడ్ మధ్యలో దూసుకెళ్లిన ఆ బంతి.. వికెట్లను ఎగురగొట్టింది. దీనితో ఏడు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది కోల్‌కత.
ఇన్నింగ్ 13వ ఓవర్‌లో మరోసారి విజృంభించాడు జన్‌సెన్. హర్షిత్ రాణాను క్లీన్ బౌల్డ్ చేశాడు. జన్‌సెన్ నుంచి దూసుకొచ్చిన షార్ట్ డెలివరీని డీప్ థర్డ్ పాయింట్ వైపు షాట్ ఆడటానికి ప్రయత్నించాడు హర్షిత్. బ్యాట్ బాటమ్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతిని వికెట్లను గాల్లోకి లేపింది. 79 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ పడింది.
ఇన్నింగ్ 16వ ఓవర్ తొలి బంతికి ఆ జట్టు చిట్టచివరి బ్యాటర్ ఆండ్రీ రస్సెల్‌ను జన్‌జెన్ అవుట్ చేసిన తీరు ఆకట్టుకుంది. అరౌండ్ ద వికెట్‌గా వేసిన లెంగ్తీ డెలివరీని ముందుకొచ్చి భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు రస్సెల్. క్రాస్ బ్యాట్ ఆడాడు. బ్యాటర్ అంచులను తాకిన ఆ బంతి బెయిల్స్ ఎగురగొట్టింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications