ప్రధాని మోదీ ఫోన్ - రోహిత్, విరాట్ పై ప్రశంసలు, ద్రావిడ్ కు థాంక్స్..!!

టీ20 వరల్డ్ కప్ 2024ను ముద్దాడిన టీమిండియా ఆటగాళ్లను ప్రధాని మోదీ ప్రశంసించారు. మ్యాచ్ పూర్తయిన తరువాత టీం సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ప్రపంచ కప్‌ను సాధించిన ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. ప్రధాన కోచ్‌గా కొనసాగిన రాహుల్ ద్రవిడ్‌కు ప్రధాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీకి అభినందనలు అని పేర్కొన్నారు. ఇక కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనను ప్రశంసించారు.

టీంపై ప్రశంసలు
టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్ ను నిలిపిన రోహిత్ టీం ను ప్రధాని మోదీ ప్రశంసలతో మంచెత్తారు. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రావిడ్‌లకు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. 'డియర్ రోహిత్ శర్మ' అంటూ మోదీ ట్వీట్ చేశారు. '' నువ్వు అద్భుతమైన పరిణితి చెందిన ఆటగాడివి. నీ దూకుడు స్వాభావం, దూకుడు బ్యాటింగ్, కెప్టెన్సీలు భారత జట్టును రూపాంతరం చెందించాయి. నీ టీ20 కెరీర్‌ను ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ రోజు నీతో మాట్లాడినందుకు ఆనందంగా ఉంది'' అంటూ ఎక్స్ వేదికగా మోదీ పేర్కొన్నారు.

PM Modi congratulated Rohit Team Special thanks for Rahul on T20 World Cup win

విరాట్.. టీ20 క్రికెట్ ఇక
కోహ్లీని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. నీతో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది విరాట్. ఫైనల్స్‌లో ఆడిన ఇన్నింగ్స్‌ లాంటి బ్యాటింగ్‌తో నువ్వు భారత జట్టు బ్యాటింగ్‌ను అద్భుతంగా ప్రోత్సాహించావు. అన్ని ఫార్మాట్లలోనూ రాణించాయి. టీ20 క్రికెట్ మిమ్మల్ని కోల్పోతుంది. కానీ కొత్త తరం ఆటగాళ్లను నువ్వు ప్రోత్సహిస్తూనే ఉంటాని నేను విశ్వసిస్తున్నానని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అదే సమయంలో రాహుల్ ద్రావిడ్‌ను కూడా మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

సక్సెస్ బాట పట్టించారు
రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన కోచింగ్ ప్రయాణం భారత క్రికెట్‌ జట్టును విజయవంతమైన టీమ్‌గా రూపొందించిందని పేర్కొన్నారు. ద్రావిడ్ అచంచలమైన అంకితభావం, వ్యూహాత్మక ఆలోచనలు, సరైన ప్రతిభను వెలికి తీసే నైపుణ్యాలు జట్టును రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. వరల్డ్ కప్ గెలవడంతో రాహుల్ ద్రావిడ్ అందించిన సహకారం భారత్ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందన్నారు. ఇక ఆయన సేవలు తరాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. రాహుల్ ద్రావిడ్ వరల్డ్ కప్‌ ట్రోఫీని పైకిఎత్తడం చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. ద్రావిడ్‌కు అభినందనలు తెలపడం సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+