IND vs SA: విశాఖ మ్యాచ్ వేళ క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ అప్డేట్, కీలక మార్పులు..!!
India Vs South Africa: విశాఖ వేదికగా కీలక పోరుకు సర్వం సిద్దమైంది. స్వదేశీ గడ్డ పై టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా.. వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. అటు సౌతా ఫ్రికా జట్టు సైతం హోరా హోరీ పోరుకు సై అంటోంది. ఈ మ్యాచ్ వేళ ఏసీఏ-పోలీసు శాఖ కీలక నిర్ణయాలు వెల్లడించింది. అదే విధంగా ఈ మ్యాచ్ లో టీమిండియాలో మూడు మార్పులు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. తుది జట్టు.. సిరీస్ డిసైడర్ గా మారిన ఈ మ్యాచ్ పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి.
విశాఖ లో కీలక పోరు కు రెండు జట్లు సమాయత్తం అయ్యాయి. సిరీస్ నిర్దేశించే మ్యాచ్ కావటంతో అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. రో - కో జోడీ క్రికెట్ విన్యాసాలు చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి గా ఉన్నారు. కోహ్లీ వరుసగా రెండు సెంచరీలు చేయటంతో... విశాఖ వేదికగా హ్యాట్రిక్ సెంచరీ సాధిస్తారనే అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి. విశాఖ వేదికగా కోహ్లీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. దీంతో.. కోహ్లీ పైన ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక.. ఈ మ్యాచ్ లో భారత్ జట్టులో మూడు మార్పులు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. జైశ్వాల్, ప్రసిద్ధ్ క్రిష్ణ, వాషింగ్టన్ సుందర్ ను తప్పించే ఛాన్స్ ఉంది. ఈ ముగ్గురి స్థానంలో జురెల్, నితీష్, తిలక్ కు అవకాశం దక్కనుంది. ఇక్కడ టాస్ కీలకంగా మారనుంది.

ఇక, ఈ మ్యాచ్ వేళ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం నుంచి నగరానికి వచ్చే వాహనాలు.. పెందుర్తి, ఎన్ఏడీ, టీసీ పాలెం మీదుగా వెళ్లాలి. నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపునకు వెళ్లే బస్సులు టీసీ పాలెం, ఎన్ఏడీ, పెందుర్తి, శొంఠ్యాం మీదుగా ప్రయాణించాలి. వీవీఐపీ పాసులున్న వాహనాలు గ్రౌండ్ పి-1, వీఐపీ వాహనాలు.. బి గ్రౌండ్లో పి-2 వద్ద నిలిపివేయాలి. వి కన్వెన్షన్ పీ-సీ వద్ద వాహనాలు నిలుపుకోవచ్చు. నగరం నుంచి మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే వాహనాదారులు హోల్డేజ్ హోమ్ జంక్షన్ వద్ద ఎడమవైపు తిరిగి సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ పి-4లో పార్కింగ్ చేయాలి. శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చిన వాహనాలు.. షెడ్ జంక్షన్ వద్ద కుడివైపునకు తిరిగి సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల పి-4 లో పార్క్ చేయాలి. మీడియా వాహనాలను గేట్ నంబరు 10, 11 సమీపంలోని వెంకటేశ్వరస్వామి గుడి వద్ద పి-5లో పార్కింగ్ చేయాలి.
ఇక, స్టేడియం లోకి కొన్ని వస్తువులను నిషేధించారు. కెమెరాలు, మ్యాచ్ బాక్సులు, లైటర్లు, సిగరెట్లు, వాటర్ బాటిళ్లు, మండే స్వభావం గల వస్తువులు, కుర్చీలు, స్టూలు, పొగాకు ఉత్పత్తులు, టిఫిన్లు, పదును వస్తువులు, తినుబండారాలు, గౌడుగులు, క్రేకర్స్, బ్యాక్ ప్యాక్స్, జంతువులు, రేడియో, ఆల్కహాల్, కర్రలు, మ్యూజికల్స్, లేజర్ లైట్లు, బెలూన్లు, గ్లాస్ బాటిళ్లు, పెర్ఫ్యూమ్స్, స్ప్రే బాటిళ్లు, సిరంజిలు, విజిల్స్, హారన్స్, స్పోర్టింగ్ బాల్స్, రోలర్ స్కేటర్లు, ప్రమోషనల్ ప్రొడక్ట్స్ ల్యాప్టాప్లు, పెన్నులు, పెన్సిళ్లు తీసుకెళ్లకూడదని స్పష్టం చేసారు.

ఇక.. మ్యాచ్ జరిగే స్టేడియం చుట్టూ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటుచేశారు. అన్ని గేట్ల వద్ద క్యూలో ప్రేక్షకులను లోపలికి పంపించేలా బారికేడ్లు సిద్ధం చేశారు. మ్యాచ్ సుమారు రాత్రి 11 గంటల సమయంలో ముగుస్తుందని, వేల సంఖ్యలో వాహనాలు జాతీయ రహదారిపైకి రాకుండా చోదకులు సంయమనం పాటించి కొద్ది నిమిషాల వ్యవధిలో వెళ్లాలని అధికారులు కోరుతున్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications