పీవీ సింధు బికినీ షో.. అతనితో కలిసి ఫుల్ ఎంజాయ్..!
భారతదేశపు బ్యాడ్మింటన్ స్టార్, ఓలింపిక్ పతక విజేత పీవీ సింధు గతేడాది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.2024 డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పీవీ సింధు వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ వెంకట దత్త సాయిని పీవీ సింధు పెళ్లి చేసుకుంది.అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం జరిగింది.భారతీయ సంప్రదాయాలతో ఈ వివాహం జరిగింది.
ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు , క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. ఇక పెళ్లిలో నూతన జంట ఆనందంగా కనిపించారు. ముఖ్యంగా వెంకట దత్త సాయి తన భార్య పీవీ సింధును పలుమార్లు ముద్దు పెట్టుకున్న ఫొటోలు నెట్టింట బాగానే వైరల్‌గా అయ్యాయి. పీవీ సింధు భర్త వెంకట దత్త సాయి విషయానికి వస్తే..పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆయన హైదరాబాద్‌కు చెందిన వ్యక్తే. రెండు కుటుంబాల మధ్య ఉన్న దీర్ఘకాలిక సంబంధాలు కారణంగానే పీవీ సింధు,వెంకట దత్త సాయిల పెళ్లి కుదిరినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే..పీవీ సింధు బికినీలో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, అవి వైరల్‌గా మారాయి. పీవీ సింధు బికినీలో కనిపించడం ఇదే మొదటిసారి, అందుకే ఈ ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆమె సముద్రంలో ఆటలాడుతూ, సరదాగా స్టిల్స్ ఇచ్చింది. తన భర్త వెంకట సాయి దత్తాతో కలిసి సముద్రంలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఈ ఫొటోలతో పాటు, ఆమె ఒక అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది: "అతను ఈదుతాడు. నేను తేలుతాను. అతను నడిపిస్తాడు. నేను నవ్వుతాను. ప్రతి దాంట్లోనూ నా సురక్షితమైన ప్రదేశం అంటూ తన పోస్టుకు క్యాప్షన్ జత చేసింది.
ఇక పీవీ సింధు కెరీర్ విషయానికి వస్తే ..2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు సాధించి భారతదేశానికి ఒలింపిక్ పోడియంపై స్థానం కల్పించింది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.2019లో బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి భారతదేశానికి మరో గొప్ప విజయం అందించింది. ఈ విజయంతో ఆమె భారతీయ క్రీడా చరిత్రలో నిలిచిపోయింది. తన అద్భుతమైన క్రీడా ప్రతిభకుగాను, పీవీ సింధు అనేక అవార్డులు, గౌరవాలను అందుకుంది. భారత ప్రభుత్వం ఆమెకు పద్మ భూషణ్ అనే అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది.












Click it and Unblock the Notifications