ఆటకు పీవీ సింధు బ్రేక్ .. గుడ్ న్యూస్‌తో రాబోతోందా..?
భారతదేశానికి రెండు ఒలింపిక్ పతకాలు అందించిన స్టార్ షట్లర్, మాజీ వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదిలో మిగిలిన అన్ని బీడబ్ల్యూఎఫ్ (BWF) టోర్నమెంట్‌ల నుండి తప్పుకుంటున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించారు.
యూరోపియన్ టోర్నీకి ముందు తన పాదానికి అయిన గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకే ఈ విరామం తీసుకున్నానని సింధు సోషల్ మీడియా ద్వారా సుదీర్ఘ పోస్ట్‌లో వెల్లడించారు. ప్రముఖ వైద్య నిపుణులు ,తన మొత్తం టీమ్ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

టోర్నీలకు దూరంగా ఉండటం బాధగానే ఉన్నా, గాయాలు ప్రతి క్రీడాకారుడి జీవితంలో ఒక భాగం. అవి మన పట్టుదల మరియు సహనాన్ని పరీక్షిస్తాయి. మరింత బలంగా, కసితో తిరిగి రావడానికి ప్రేరణనిస్తాయి అని పీవీ సింధు పేర్కొంది.
సింధు తన రికవరీ ట్రైనింగ్‌ను ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలిపారు. డాక్టర్ వేన్ లంబార్డ్, నిషా రావత్, తన కోచ్ ఇర్వాన్ స్యా పర్యవేక్షణలో తాను కోలుకుంటున్నానని, త్వరలోనే ఉత్సాహంగా కోర్టులోకి అడుగుపెడతానని అభిమానులకు హామీ ఇచ్చారు. ఆమె తనపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
సింధు ఈ విరామం ప్రకటించడంతో సోషల్ మీడియాలో మరో అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఆటకు దూరంగా ఉండటానికి కారణం గాయం కంటే గర్భం దాల్చడమే అయి ఉంటుందని అభిమానులు, నెటిజన్లు భావిస్తున్నారు.
గతేడాది డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హైదరాబాద్‌కు చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ వెంకట దత్త సాయిని సింధు ఘనంగా వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహం తర్వాత, ఆమె ఈ సుదీర్ఘ విరామం ప్రకటించడం అభిమానుల అనుమానాలకు తావిచ్చింది. సింధు తన పోస్ట్‌లో గాయాన్ని మాత్రమే ప్రస్తావించినా, వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టం కోసమే ఆమె విరామం తీసుకుని ఉండవచ్చని చాలామంది చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి, సింధు దృష్టి మొత్తం రికవరీపైనే ఉంది. తన అభిమానులు చూపించే అపారమైన ప్రేమ, మద్దతుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications