PVR Inox IPL: క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. పీవీఆర్ ఐనాక్స్‌లో ఐపీఎల్ ప్రత్యక్షప్రసారం
PVR Inox IPL: ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ క్రికెట్ వీరాభిమానులకు శుభవార్త చెప్పింది. పీవీఆర్ ఐనాక్స్ బీసీసీఐతో కీలక ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్ 2025లోని కొన్ని ముఖ్యమైన మ్యాచ్ లను దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. దేశంలోని 30కి పైగా నగరాల్లోని తమ థియేటర్లలో ఐపీఎల్ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిర్ణయం ప్రేక్షకులకు స్టేడియం తరహా అనుభూతిని కలిగిస్తుందని కంపెనీ వెల్లడించింది. వీకెండ్ మ్యాచ్ లు, ప్లే ఆఫ్ మ్యాచ్ లను థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐతో పీవీఆర్ ఐనాక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకతో ఈ ప్రసారాలు ప్రారంభం కానున్నాయని పీవీఆర్ ఐనాక్స్ స్పష్టం చేసింది.

హై డెఫినిషన్ స్క్రీన్స్, హైక్వాలిటీ విజువల్స్, సౌండ్ , సీటింగ్ తో స్టేడియంలో చూసిన అనుభూతి వస్తుందని పీవీఆర్ ఐనాక్స్ రెవెన్యూ, ఆపరేషన్స్ సీఈవో గౌతమ్ దత్తా వెల్లడించారు. గతేడాది క్రికెట్ మ్యాచ్ ల ప్రసారంలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. అందుకే ఈ ఏడాది కూడా ప్రీమియం క్వాలిటీ ఎక్స్పీరియన్స్ అందించే ఉద్దేశంతోనే ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. సినిమాను, క్రియేటర్ ను ఒకే వేదికపైకి తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. పలు రాష్ట్రాల్లోని ప్రధాన మెట్రో నగరాలతో పాటు టైర్-2, టైర్-3 సిటీల్లో ఈ స్క్రీనింగ్ నిర్వహించనున్నామని చెప్పారు. టికెట్లు పీవీఆర్ ఐనాక్స్ వెబ్ సైట్, యాప్స్, బుక్ మై షో లో అందుబాటులో ఉంటాయని చెపప్పారు.












Click it and Unblock the Notifications