సింగిల్ బెర్త్ కోసం..: కామన్ శత్రువు ఒక్కడే

IPL 2025 Playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ముగింపుదశకు వచ్చేసింది. అన్ని జట్లు కూడా ఒకట్రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంది. ఒక్క రాజస్థాన్ రాయల్స్ మాత్రమే లీగ్స్ మ్యాచ్ లన్నీ ఆడేసింది. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 29వ తేదీన ప్లేఆఫ్స్ ఆరంభమౌతాయి. జూన్ 3వ తేదీన ఫైనల్స్ ఉంటుంది. ఈ సారి ఛాంపియన్ ఎవరనేది ఉత్కంఠభరితంగా మారింది.

ఆ జట్లు ఇవే..

ఇప్పటికే మూడు జట్లను ప్లేఆఫ్స్ కు చేరాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకిన గుజరాత్ టైటాన్స్, రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, థర్డ్ పొజీషన్ లో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్.. ప్లేఆఫ్స్ కు చేరుకున్నాయి. కోల్ కత నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్.. ఇంటిదారి పట్టాయి.

Qualification Scenario for MI and DC Mumbai Indians qualify if they win against Delhi Capitals

సింగిల్ బెర్త్..

ప్లేఆఫ్స్ లో ఇంకొక బెర్త్ మాత్రమే మిగిలివుంది. ఈ ఒక్క బెర్త్ కోసం రెండు జట్లు పోటీలో నిలిచాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ పోటీ పడుతున్నాయి. ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ తో తలపడబోతోంది. ఈ సాయంత్రం మ్యాచ్ జరుగనుంది. ఇందులో గెలిస్తేనే ఈ రెండు జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండగలుగుతాయి.

ముంబై సినారియో..

ఢిల్లీ కేపిటల్స్ తో ఈ సాయంత్రం జరిగే గేమ్ లో ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. అలా జరిగితేనే ఆ జట్టు నేరుగా ప్లేఆఫ్స్ లో అడుగు పెట్టగలుగుతుంది. ఒకవేళ ఈ గేమ్ లో ఢిల్లీ గెలిస్తే మాత్రం ముంబై ఇండియన్స్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. తన ప్రత్యర్థి ఢిల్లీ కేపిటల్స్ కు బాటలు పరిచినట్టవుతుంది. ఆ జట్టు ఓటముల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది.

ముంబైపై ఢిల్లీ గెలిస్తే..

ఢిల్లీ కేపిటల్స్ గెలిస్తే.. ఆ జట్టు చివరిదైన తన తదుపరి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండగలుగుతాయి. ఆ మ్యాచ్ లో కూడా ఢిల్లీ కేపిటల్స్ గెలిస్తే.. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ గేట్లు మూసుకున్నట్టవుతుంది.

ముంబై పాయింట్లు ఎన్ని..

పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు ఏడింట్లో విజయాలను సాధించింది. అయిదింట్లో ఓడింది. 14 పాయింట్లను సమకూర్చుకుంది. ఢిల్లీ కేపిటల్స్ తో కాకుండా.. పంజాబ్ కింగ్స్ తో ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంది.

డీసీ పాయింట్లు ఎన్ని..

పాయింట్ల పట్టికలో ఢిల్లీ కేపిటల్స్ ప్రస్తుతం అయిదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన ఈ జట్టు ఆరింట్లో విజయాలను సాధించింది. అయిదింట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. 13 పాయింట్లు డీసీ ఖాతాలో ఉన్నాయి. ముంబై ఇండియన్స్ తో కాకుండా.. పంజాబ్ కింగ్స్ తో ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ రెండు జట్లు కూడా కామన్ గా పంజాబ్ పై డిపెండ్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+