గంభీర్ కు పదవీ గండం?

భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ కొనసాగింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆయన హయాంలో ఇప్పటివరకు ఆడిన 19 టెస్టుల్లో ఏడింటిని మాత్రమే గెలిపించింది టీమిండియా. ఫలితంగా గంభీర్ పదవిపై అనేక ఊహాగానాలు చెలరేగాయి. 2027 వరల్డ్ కప్ వరకూ గంభీర్ కొనసాగకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాత వేటు వేయడం ఖాయమనీ వార్తలొచ్చాయి.

గంభీర్ స్థానంలో టెస్ట్ ఫార్మట్ కోసం మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను కోచ్‌గా తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోన్నట్లు ప్రచారం జరిగింది. వీటన్నింటికీ తాజాగా తెరదించింది బీసీసీఐ. గంభీర్ ను ఆయనను తొలగించే ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది. నవంబర్ 2027 వరకు గంభీర్ ప్రస్తుత ఒప్పందం కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అధికారికంగా వెల్లడించారు. గంభీర్ కు ఉద్వాసన పలకట్లేదని అన్నారు.

Rajeev Shukla Speaks on Gautam Gambhir and BCCI s Next Move

రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత.. టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ అపాయింట్ అయ్యారు. 2024 జులై నుంచి కొనసాగుతున్నారు. 2027 నవంబర్ వరకు ఈ హోదాలో కొనసాగాల్సి ఉంది. ఈ మేరకు ఆయనతో బీసీసీఐ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఆయన పర్యవేక్షణలో భారత జట్టు టెస్ట్ ఫార్మాట్‌లో ఆశించినంతగా రాణించలేకపోయింది. ఇప్పటివరకు ఆడిన 19 టెస్టుల్లో ఏడింట్లో నెగ్గింది.

గత సంవత్సరం ఆస్ట్రేలియాలో ఒక టెస్ట్, ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో రెండు టెస్టులను గెలుచుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. స్వదేశీ మైదానాల్లో న్యూజిలాండ్‌తో 0-3, దక్షిణాఫ్రికాతో 0-2 తేడాతో అవమానకరమైన ఓటములను చవిచూడటం జట్టు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. గంభీర్ నేతృత్వంలో భారత్ ఇప్పటివరకు అయిదు స్వదేశీ టెస్టుల్లో ఓడిపోయింది. ఇది ఏ టీమిండియా హెడ్ కోచ్‌కైనా అత్యధికం. సొంత గడ్డపై టెస్ట్ సిరీస్‌లలో రెండుసార్లు వైట్‌వాష్‌కు గురైన ఏకైక భారత ప్రధాన కోచ్‌గా ఆయన నిలిచారు.

ఈ గణాంకాలు జట్టు భవిష్యత్తుపై ప్రశ్నార్థకం వేస్తున్నాయనడంలో సందేహం లేదు. గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల్లో స్వదేశీ అభిమానుల ముందు భారత్ ఘోర పరాజయాలు చవిచూసిన తర్వాత, కనీసం టెస్ట్ ఫార్మాట్ నుండి గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లు విస్తృతంగా వెల్లువెత్తాయి. ఏదేమైనా.. బీసీసీఐ మాత్రం గంభీర్‌ను ఉద్వాసన పలకడానికి సుముఖంగా లేదనేది తేలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+