రిమార్కబల్ రషీద్ ఖాన్- మొదటి బౌలర్ అతనే

ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్.. చరిత్ర సృష్టించాడు. షార్జాలో జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఏ బౌలర్ కు కూడా సాధ్యం కాని రిమార్కబుల్ ఫీట్ అది. టీ20 ఇంటర్నేషనల్స్ లో 200 వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి బౌలర్ గా తన పేరును లిఖించుకున్నాడీ 28 ఏళ్ల లెగ్ స్పిన్నర్. అతి కొద్ది ఇన్నింగ్స్ లల్లోనే అతను ఘనతను సొంతం చేసుకున్నాడు.

జింబాబ్వే బ్యాటర్ టడివనషె మరుమనిని అవుట్ చేయడం ద్వారా 200 వికెట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ షార్ట్ ఫార్మట్ లో 120 మ్యాచ్ లల్లోనే అతను ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. 2015లో ఇదే జింబాబ్వే జట్టుపై బులవాయో పార్క్ లో తన మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడాడు రషీద్ ఖాన్. సరిగ్గా 11 సంవత్సరాల తర్వాత అదే జింబాబ్వేపై తన 200 వికెట్ ను సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Rashid Khan Scripts History as become the 1st bowler in T20i to claim 200 wickets in Zimbabwe match

రషీద్ ఖాన్ తర్వాత రెండో స్థానంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ఆదిల్ రషీద్ ఉన్నాడు. మ్యాచ్ ల పరంగా గానీ, వికెట్ల పరంగా గానీ వీరిద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. 153 మ్యాచ్ లు ఆడిన ఆదిల్ ఇప్పటివరకు పడగొట్టిన వికెట్ల సంఖ్య.. 171. హాంకాంగ్ కు చెందిన బౌలర్ ఎహసాన్ ఖాన్- 165, న్యూజిలాండ్ మాజీ బౌలర్ టిమ్ సౌథీ- 164 వికెట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. 163 వికెట్లతో శ్రీలంక స్టార్ స్నిన్నర్ వనిందు హసరంగ అయిదో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఏడాదిలో 12 రోజులు మాత్రమే తెరిచివుండే హాసనాంబ ఆలయం: బెంగళూరు నుంచి..
ఏడాదిలో 12 రోజులు మాత్రమే తెరిచివుండే హాసనాంబ ఆలయం: బెంగళూరు నుంచి..

కాగా.. ఈ మ్యాచ్ లో జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ 116 పరుగులు సాధించాడు. ఇజాజ్ అహ్మద్జాయ్- 52 పరుగులతో అతనికి చక్కటి సహకారాన్ని అందించాడు. 38 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన దశలో అజ్మతుల్లా చెలరేగాడు. 50 బంతుల్లో 12 సిక్సర్లు, అయిదు ఫోర్లతో 116 పరుగులు చేశాడు.

వైట్ వాష్ పై కన్నేసిన టీమిండియా: విన్నింగ్ కాంబినేషన్ లో మార్పులు?
వైట్ వాష్ పై కన్నేసిన టీమిండియా: విన్నింగ్ కాంబినేషన్ లో మార్పులు?

అనంతరం ఛేజింగ్ కు దిగిన జింబాబ్వే చివరి వరకూ పోరాడింది. 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 202 పరుగుల వద్ద ఆగిపోయింది. కేప్టెన్ సికందర్ రజా.. 56 బంతుల్లో తొమ్మిది సిక్సర్లు, అయిదు ఫోర్లతో సెంచరీ బాదాడు. 106 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో అతనికి సహకరించే బ్యాటర్లు కొరవడటంతో ఓటమి తప్పలేదు.. జింబాబ్వేకు. చిట్టచివరి బ్యాటర్ తఫద్జవా త్సింగా 23 బంతుల్లో 31 పరుగులతో కొంతవరకు బౌలర్లను ప్రతిఘటించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+