బుడ్డోడికి జడ్డూ స్పెషల్ క్లాస్! (వీడియో)

టీ20 వరల్డ్ కప్ ముగిసిన తరుణంలో ఐపీఎల్ 2026 సందడి అప్పుడే మొదలైంది. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ ఇప్పట్నుంచే శిక్షణను ముమ్మరం చేసింది. అయితే రాజస్థాన్ రాయల్స్ క్యాంపులో అందరి దృష్టిని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆకర్షిస్తున్నాడు. దశాబ్ధ కాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వెన్నెముకగా నిలిచిన రవీంద్ర జడేజా.. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జెర్సీలో మెరవనుండటం విశేషం.

సంజూ శాంసన్ స్థానంలో రవీంద్ర జడేజా ఎంట్రీ
ఈ ఐపీఎల్ సీజన్ వేలానికి ముందే ఓ భారీ ట్రేడ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్ స్టార్ కెప్టెన్ సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వెళ్లగా.. సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం జైపూర్‌లో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లో రవీంద్ర జడేజా కేవలం తన ఆటపైనే కాకుండా జట్టులోని యువ ఆటగాళ్లకు మార్గదర్శగా వ్యవహరిస్తున్నాడు.

Ravindra Jadeja Guides 14-Year-Old Vaibhav Suryavanshi at Rajasthan Royals Training Camp Video Viral

జడేజా వర్సెస్ వైభవ్.. ఇంట్రెస్టింగ్ చిట్‌చాట్
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకుంది. అందులో రవీంద్ర జడేజా 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో ముచ్చటిస్తూ కనిపించాడు. "నువ్వు రీసెంట్‌గా డీవై పాటిల్ టీ20 కప్ ఆడావు కదా?" అంటూ జడేజా వైభవ్ సూర్యవంశీని ఆరా తీశాడు. "అవును సార్, నిన్ననే ఇక్కడికి చేరుకున్నాను. నేను డీవై పాటిల్ బ్లూ టీమ్ తరఫున ఆడాను. మా జట్టు సెమీఫైనల్ వరకు వెళ్లింది, కానీ ముంబై కస్టమ్స్ చేతిలో ఓడిపోయాం" అని వైభవ్ సూర్యవంశీ వివరించాడు. చిన్న వయస్సులోనే ఐపీఎల్ జట్టులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీకి జడేజా వంటి దిగ్గజ ఆటగాడితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఓ గొప్ప అవకాశంగా క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్ భారీ కసరత్తు
రాజస్థాన్ రాయల్స్ జట్టు తన సన్నాహాలకు ఫిబ్రవరిలోనే ప్రారంభించింది. రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, వైభవ్ సూర్యవంశీ వంటి కీలక ఆటగాళ్లు నాగ్‌పూర్‌లోని హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఇప్పటికే కఠిన శిక్షణ పొందారు. ఇప్పుడు జట్టు మొత్తం జైపూర్‌లో ఏకమై మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ పోరాటానికి సిద్ధమవుతోంది. అనుభవం (జడేజా), యువ రక్తం (వైభవ్) కలయికతో ఈసారి రాజస్థాన్ రాయల్స్ టైటిల్ రేసులో బలంగా నిలవాలని చూస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+