Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RCB-Vijay Mallya: ఆర్సీబీ విక్టరీ.. జట్టును అభినందించిన విజయ్ మాల్యాపై ట్రోలింగ్!

RCB-Vijay Mallya: ఐపీఎల్ పండుగ సీజన్ ప్రారంభమైంది. 18వ ఐపీఎల్ సీజన్ మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో కోల్‌కతా జట్టును ఓడించింది. బెంగళూరు జట్టు కేకేఆర్‌పై బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఆధిపత్యం చెలాయించింది. కోల్‌కతా చేతిలో వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడిన తర్వాత ఆర్సీబీ చివరకు వారిపై విజయం సాధించింది. ఈ సందర్భంగా కోల్‌కతాపై విజయం సాధించిన ఆర్సీబీ జట్టుకు ఆ టీమ్ మాజీ యజమాని విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు.

కేకేఆర్ పై ఆర్సీబీ విజయం గురించి విజయ్ మాల్యా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ట్వీట్ చేశారు. 'కేకేఆర్‌పై గొప్ప విజయం సాధించినందుకు ఆర్సీబీకి అభినందనలు' అని ఆయన రాశారు. 'చివరకు బెంగళూరు బౌలింగ్ ను వ్యాఖ్యాతలు ప్రశంసించడం వినడం ఆనందంగా ఉంది. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు" అని విజయ మాల్యా తన ట్వీట్ ద్వారా ప్రశంసించారు.

RCB Victory Vijay Mallya Congratulates the Team Faces Online Trolling

విజయ్ మాల్యా ఈ విషయాన్ని ట్వీట్ చేయగానే.. నెటిజన్లు ఆయనను ట్రోల్ చేయడం ప్రారంభించారు. నెటిజన్లు ఆయనను భారత్ కు రమ్మని అడగడం ప్రారంభించారు. కొంత మందికి తిరిగి డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావ్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. విజయ్ మాల్యా 2016లో 17 భారతీయ బ్యాంకులను దాదాపు 900 కోట్ల రూపాయలను తీసుకుని దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. విజయ్ మాల్యా ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నారు. ఈ స్కామ్ చేసిన తర్వాత నుంచి ఆయన భారత్ కు తిరిగి రాలేదు.

సాల్డ్, కోహ్లీ విధ్వంసానికి ఎగిరిపోయిన కేకేఆర్

ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో టాస్ ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేసి బెంగళూరు ముందు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీని తర్వాత ఆర్సీబీ ఓపెనర్లు కేకేఆర్ ను మ్యాచ్ నుంచి దూరం చేశారు.ఫిల్ సాల్ట్ 56 పరుగులు చేసి ఔట్ కాగా, విరాట్ కోహ్లీ 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి మధ్య తొలి వికెట్ కు 95 పరుగుల భాగస్వామ్యం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కెప్టెన్ రజత్ పాటిదార్ 34 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ లక్ష్యాన్ని బెంగళూరు అలవోకగా ఛేదించి తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. తొలి మ్యాచ్ గెలవడంతో టైటిల్ ఆర్సీబీదేనని ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+