ఆర్సీబీకి మైండ్ బ్లోయింగ్ వ్యూయర్‌షిప్
ఐపీఎల్ టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలబెట్టుకుంది. వరుసగా రెండో సీజన్ లో కూడా ఛాంపియన్ గా ఆవిర్భవించింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను అయిదు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన జీటీ నిర్ణీత 20 ఓవర్లల్లో 155 పరుగులే చేయగా.. దీన్ని 18 ఓవర్లల్లో అయిదు వికెట్లు కోల్పోయి అందుకుంది. 161 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ కు రికార్డుస్థాయిలో వ్యూవర్ షిప్ లభించింది. మొత్తం 551 మిలియన్ల మంది ఈ మ్యాచ్ ను జియో హాట్ స్టార్ పై తిలకించారు. 2025 నాటి ఐపీఎల్ ఫైనల్ తో పోల్చుకుంటే తక్కువే. అయినప్పటికీ.. ఈ సీజన్ లో ఇదే రికార్డు వ్యూవర్ షిప్. ఆర్సీబీ- పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన గత ఏడాది ఫైనల్ ను తిలకించిన వారి సంఖ్య.. 678 మిలియన్లు.

జియో హాట్ స్టార్ లో ఎక్కువమంది వీక్షించిన మ్యాచ్ లల్లో మొదటి నాలుగు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందినవే. ఈ నాలుగింట్లో ఆర్సీబీ- గుజరాత్ టైటాన్స్ ఫైనల్ 551 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ఉంది. మిగిలిన వాటిల్లో ఆర్సీబీ- సన్ రైజర్స్ హైదరాబాద్- 434, ఆర్సీబీ- రాజస్థాన్ రాయల్స్- 413, ఆర్సీబీ- ముంబై ఇండియన్స్- 410 మిలియన్ వ్యూస్ తో ఆ తరువాతి స్థానాలను ఆక్రమించాయి.
ఆర్సీబీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లను ఎక్కువమంది తిలకించారు. టీవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కలిపి సగటున ప్రతి మ్యాచ్‌కు 308 మిలియన్ల మంది వీక్షించారు. జియో సినిమా వ్యూయర్‌షిప్‌లో ఆర్సీబీ అత్యధికంగా 307.20 మిలియన్ సగటు వీక్షకులను సాధించింది. లీగ్ దశలో ఈ సీజన్ మొత్తం మీద అత్యధికంగా వీక్షించిన ఒకేఒక మ్యాచ్ ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్. దీన్ని ఏకంగా 426 మిలియన్ల మంది చూశారు.
టీవీ, జియో సినిమా వ్యూయర్ షిప్ కలిపి చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ సగటున 308 మిలియన్ల వీక్షకులతో మొదటి స్థానంలో నిలిచింది. 303 మిలియన్లతో ఆర్సీబీ రెండు, ముంబై ఇండియన్స్ 293 మిలియన్లతో మూడో స్థానంలో ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ 290 మిలియన్ల వీక్షణలతో నాలుగో స్థానాన్ని దక్కించుకోగా, కోల్‌కతా నైట్ రైడర్స్ 280 మిలియన్లతో టాప్ 5లో ఒకటిగా నిలిచింది.












Click it and Unblock the Notifications