Jio IPL 2024 offers: జియో ఐపీఎల్ ఆఫర్లు ఇవే..!
రిలయన్స్ జియో ఐపీఎల్ 2024 సందర్భంగా తమ మొబైల్, బ్రాడ్ బ్యాండ్, జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ కస్టమర్ల కోసం కొత్త ప్రమోషనల్ ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. ఐపీఎల్ టోర్నీ సందర్భంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకునే లక్ష్యంతో జియో ఈ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా మొబైల్, బ్రాడ్ బ్యాండ్ ద్వారా క్రికెట్ మ్యాచ్ లను వీక్షించే అభిమానుల్ని ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్లను తెచ్చింది.
జియో ప్రీ పెయిడ్ యూజర్ల కోసం అన్ లిమిటెడ్ పేరుతో రూ.49 రీఛార్జ్ ప్లాన్ ను అమల్లోకి తెచ్చింది. ఇందులో యాక్టివ్ ప్లాన్ ఉన్న వారు అదనంగా రోజుకు 25 జీబీ డేటా కోసం రూ.49తో రీఛార్జ్ చేయించుకుంటే సరిపోతుంది. క్రికెట్ మ్యాచ్ మొత్తం చూడాలనుకునే వారి కోసం ఈ ప్లాన్ తెచ్చినట్లు తెలుస్తోంది.
అలాగే ఐపీఎల్ 2024 ఆఫర్ గా చెబుతున్న జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ వినియోగదారులకు 50 రోజుల ఉచిత బ్రాడ్ బ్యాండ్ స్కీమ్. ఏప్రిల్ 30 వరకూ ఇది అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు టెలికాం ఆపరేటర్ కు ప్రస్తుత బిల్ చెల్లించిన తర్వాత ఈ 50 రోజుల డిస్కౌంట్ వోచర్ ను రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. తర్వాత బిల్లింగ్ లో దాన్ని సర్దుబాటు చేస్తారు. డిస్కౌంట్ ఓచర్ కాల పరిమితి ముగిసేలోపు దీన్ని మై జియో యాప్ లో రిడీమ్ చేసుకోవాలి.

ఈ ఆఫర్ కొత్త కస్టమర్లతో పాటు ఇప్పటికే ఉన్న జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ కస్టమర్లకూ వర్తిస్తుంది. అయితే కొత్త కస్టమర్లు జియో ట్రూ 5జీ మొబిలిటీ సర్వీస్ ను కలిగి ఉండాలి. అలాగే కనీసం 10 రోజుల నెట్‌వర్క్‌లో గల జియో ఫైబర్ లేదా ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌ని జియో ట్రూ 5జీ కనెక్షన్‌తో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌గా యాక్టివేట్ చేసి, ఈ ఆఫర్ అందుకోవచ్చు. జియో ఫైబర్ లేదా ఎయిర్ ఫైబర్ కనెక్షన్ యాక్టివేట్ అయిన తర్వాత జియో ట్రూ 5జీ కనెక్షన్ ఇది ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది.
ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ను ఇన్ స్టాల్ చేసి, యాక్టివేట్ చేశాక 50 రోజుల ఉచిత తగ్గింపు ఓచర్ 7 వర్కింగ్ డేస్ లో మై జియో అకౌంట్ కు క్రెడిట్ చేస్తారు. డిస్కౌంట్ వోచర్ క్రెడిట్ తేదీ నుండి రెండు సంవత్సరాల వరకు చెల్లుబాటులో ఉంటుంది. కానీ బదిలీ మాత్రం చేయబడదని జియో వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications