నేను ఉండి ఉంటే సీన్ వేరేలా ఉండేది: రిషబ్ పంత్
T20 World Cup 2026: వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి ప్రతి భారతీయ క్రికెట్ అభిమానికి ఓ తీరని వేదన. అప్పటివరకు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన భారత్.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. అప్పట్లో కారు ప్రమాదానికి గురై జట్టుకు దూరంగా ఉన్న రిషబ్ పంత్.. తాజాగా ఆ ఓటమిపై స్పందించారు. టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహకాల్లో భాగంగా జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రిషబ్ పంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పంత్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రిషబ్ పంత్ ఏమన్నాడంటే?
2023 వన్డే ప్రపంచ కప్ పైనల్ ఓటమి గురించి రిషబ్ పంత్ మాట్లాడుతూ.. "ఒక విషయం మాత్రం ఖచ్చితం.. నేను ఆ మ్యాచ్ ఆడి ఉంటే భారత్ ఆ విధంగా ఓడిపోయేది కాదు. ఒక క్రికెటర్‌గా నాకు అనిపించింది నేను చెబుతున్నాను. ఆస్ట్రేలియా విజయం గౌరవించదగినదే, కానీ నేను గనుక ఆ రోజు జట్టులో ఉండి ఉంటే ఖచ్చితంగా తేడా చూపించేవాడిని" అని రిషబ్ పంత్ పేర్కొన్నారు. ఆ రోజు అహ్మదాబాద్ పిచ్‌పై బ్యాటర్లు తడబడిన వేళ.. రిషబ్ పంత్ ఉండి ఉంటే తనదైన శైలిలో దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించేవాడని ఆయన అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.

విజయాల జోరులో రిషబ్ పంత్
కారు ప్రమాదం తర్వాత అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, భారత జట్టు కీలక విజయాల్లో భాగస్వామి అయ్యారు. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్‌లో జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలోనూ భారత్ ట్రోఫీని ముద్దాడటంతో పంత్ తనదైన ముద్ర వేశారు. "మేము ద్వైపాక్షిక సిరీస్‌లు చాలా గెలిచాం, కానీ ఐసీసీ ట్రోఫీ గెలవడం అనేది మరో స్థాయి అనుభూతిని ఇస్తుంది" అని రిషబ్ పంత్ తన మనసులోని మాటను పంచుకున్నారు.












Click it and Unblock the Notifications