నేనేమి చేశాను పాపం..!!

రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన లో- స్కోర్ మ్యాచ్‌లో ఓటమి.. లక్నో సూపర్ జెయింట్స్ ను విమర్శల పాలు చేస్తోంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్దేశించిన 160 పరుగులను కూడా అందుకోలేకపోవడం పట్ల ఆ జట్టు ట్రోలింగ్స్ కు గురి అవుతోంది. పైగా కోట్ల రూపాయలు పెట్టిన కేప్టెన్ రిషభ్ పంత్, ఎయిడెన్ మార్క్ రమ్ డకౌట్ కావడం, మయాంక్ యాదవ్ వికెట్ లెస్ గా మిగలడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఎల్ఎస్జీ 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. పవర్‌ప్లేలోనే ఆయుష్ బదోని, రిషభ్ పంత్, ఎయిడెన్ మార్క రమ్ డకౌట్‌ కావడంతో జట్టు పరాజయానికి బాటలు వేసింది. ఈ ఓటమిపై లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చాడు. జట్టు బ్యాటింగ్ వైఖరిపై అసహనం వ్యక్తం చేశాడు. ఇది ఆ జట్టుకు వరుసగా నాలుగో ఓటమి. బౌలర్లు చేసిన కృషిని బ్యాటర్లు వృథా చేశారని, తాను కూడా ఇందుకు మినహాయింపు కాదని తేల్చి చెప్పాడు.

Rishabh Pant Fire Alarm Ducks for 3 Batters Pushes LSG to the Brink in IPL Trolls on the Team

ఈ ఓటమిని గురించి వివరించడం కష్టమని, తన వద్ద ఎటువంటి మాటల్లేవని పంత్ పేర్కొన్నాడు. బ్యాటింగ్ తమను కలవరపెడుతోందని అంగీకరించాడు. దీనికి తగిన సమాధానాలు ఏమిటనేది త్వరగా కనుగొనాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఈ ఓటమి నుంచి తప్పించుకోవడానికి తాను ఎటువంటి సాకులు చెప్పట్లేదని, నిజాయితీగా పరాజయాన్ని అంగీకరిస్తున్నానని వ్యాఖ్యానించాడు. బౌలర్లు అద్భుతంగా రాణించినా బ్యాటింగ్ లోపాలు ఉన్నాయని పేర్కొన్నాడు. తమకు ఫైర్‌పవర్ ఉన్నా ఆత్మవిశ్వాసం లేదని చెప్పాడు.

రిషభ్ పంత్, ఎయిడెన్ మార్క్ రమ్, ఆయుష్ బదోని డకౌట్ కావడంతోనే జట్టు ఓటమి ఖాయమైంది. లేని పరుగు కోసం తాపత్రయ పడి బదోనీ రనౌట్ అయ్యాడు. జట్టు స్కోరు 11 పరుగులకు మూడు టాప్ ఆర్డర్ వికెట్లు నేలకూలాయి. ఓపెనర్ మిఛెల్ మార్ష్ ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. 41 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 55 పరుగులు సాధించాడు. నికొలస్ పూరన్- 22, హిమ్మత్ సింగ్- 15, ముకుల్ చౌదరి- 7, మహ్మద్ షమీ- 6, మయాంక్ యాదవ్- 5, దిగ్వేష్ రాఠీ 2 పరుగులు చేశారు.

ఈ ఓటమి.. లక్నో జట్టుపై ట్రోలింగ్ కు దారి తీసింది. సెటైర్లు సంధిస్తోన్నారు యూజర్లు. కేఎల్ రాహుల్ వంటి నిఖార్సయిన స్పెషలిస్టును లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ గోయెంకా అనవసరంగా వదులుకున్నాడని, 27 కోట్ల రూపాయలు ధారపోసి రిషభ్ పంత్ ను తీసుకోవడం వ్యర్థమని కామెంట్స్ పెడుతున్నారు. 21 కోట్ల రూపాయల మార్క్ రమ్ సైతం నిరాశపర్చడం, రూ. 11 కోట్ల మయాంక్ యాదవ్ వికెట్ లెస్ కావడంపై సెటైర్లు వేస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+